బూమ్‌...! | Shades of Saaho 2 are the perfect birthday gift for Shraddha Kapoor | Sakshi
Sakshi News home page

బూమ్‌...!

Mar 4 2019 3:24 AM | Updated on Jul 17 2019 10:14 AM

Shades of Saaho 2 are the perfect birthday gift for Shraddha Kapoor - Sakshi

ప్రభాస్‌,శ్రద్ధాకపూర్‌

పెద్ద క్రైమ్‌ జరిగింది. దోషులను పట్టుకునేందుకు ఇంటెలిజెన్స్‌ బ్యూరో విభాగం పక్కా స్కెచ్‌ వేసింది. ఈ స్కెచ్‌ ఏంటి? దోషులు ఎలా పట్టుపడ్డారు? అనే అంశాలను వెండితెరపై చూడాల్సిందే. ప్రభాస్‌ హీరోగా సుజీత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘సాహో’. బాలీవుడ్‌ బ్యూటీ శ్రద్ధాకపూర్‌ ఈ సినిమాతో సౌత్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఆదివారం ఆమె బర్త్‌డే సందర్భంగా ‘షేడ్స్‌ ఆఫ్‌ సాహో 2’ వీడియోను రిలీజ్‌ చేశారు. ఇంతకుముందు ప్రభాస్‌ బర్త్‌డే సందర్భంగా ‘షేడ్స్‌ ఆఫ్‌ సాహో 1’ వీడియోను విడుదల చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. తాజా వీడియో చివర్లో ప్రభాస్‌ బూమ్‌ అని స్టైలిష్‌గా పలకడం హైలైట్‌గా చెప్పుకోవచ్చు. ఇక‘షేడ్స్‌ ఆఫ్‌ సాహో 2’ ప్రభాస్, శ్రద్ధా కపూర్‌ మరింత స్టైలిష్‌గా కనిపించారు.

విజువల్స్‌ ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇంటర్‌నేషనల్‌ క్రైమ్‌ నేపథ్యంలో సినిమా ఉంటుందని ‘షేడ్స్‌ ఆఫ్‌ సాహో’ వీడియోలను చూస్తోంటే అర్థం అవుతోంది. ఈ సినిమాలో శ్రద్ధాకపూర్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో ఆఫీసర్‌గా కనిపిస్తారని తెలుస్తోంది. ఇక ప్రభాస్‌ క్యారెక్టర్‌లో షేడ్స్‌ ఉన్నాయట. దొంగ, పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రల్లో ప్రభాస్‌ కనిపిస్తారని అంచనా. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమాను వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్నారు. మలయాళం నటుడు లాల్, జాకీష్రాఫ్, మందిరాబేడీ, ఎవెలిన్‌శర్మ, అరుణ్‌విజయ్, నీల్‌ నితిన్‌ ముఖేష్, మురళీశర్మ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు శంకర్‌ ఎహెసన్‌ లాయ్‌ త్రయం సంగీతం అందిస్తున్నారు. ‘సాహో’ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement