ఫ్యాన్స్‌ కోసం మరింత నిజాయితీగా పని చేస్తాను

Savyasachi Movie Pre Release Function - Sakshi

నాగచైతన్య

‘తాతగారు మెదలుపెట్టిన ప్రయాణం ఇది. నాన్నగారికి, సుమంత్‌ అన్నకు, నాకు, అఖిల్‌కు, సమంతకు ఇలా మా అందరికీ మీ ప్రేమాభిమానాలు, సపోర్ట్‌ ఇస్తూనే ఉన్నారు. తరాలు మారినా తరగని ప్రేమను అందిస్తున్నారు. కొన్నిసార్లు మిమ్మల్ని నిరుత్సాహపరిచాను, కొన్నిసార్లు ఎనర్జీ ఇచ్చాను. కానీ మనం అందరం ఇలా కలసి ఉండటం నాకు ముఖ్యం’’ అన్నారు నాగచైతన్య. చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య, నిధి అగర్వాల్‌ జంటగా తెరకెక్కిన చిత్రం ‘సవ్యసాచి’. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ ఎర్నేని, రవిÔ¶ ంకర్, మోహన్‌ చెరుకూరి నిర్మించారు. కీరవాణి సంగీత దర్శకుడు.  ఈ చిత్రం నవంబర్‌ 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు.

 నాగచైతన్య మాట్లాడుతూ – ‘‘ఈ వేడుకకు వచ్చినందకు కొరటాల శివగారికి, రౌడీ విజయ్‌కు థ్యాంక్స్‌. ఉదయం లేవగానే ఓ చెడు వార్త వినాల్సి వచ్చింది. మా కుటుంబానికి చాలా  సపోర్ట్‌గా ఉన్న శివప్రసాద్‌గారు మనల్ని వదిలేసి వెళ్లిపోయారు. ఆయన కుటుంబానికి ధైర్యం ఇవ్వాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను.  ఈ సినిమా కోసం అందరి కంటే చందు ఎక్కువగా కష్టపడ్డాడు. యునిక్‌ పాయింట్‌కి కమర్షియల్‌ పాయింట్స్‌ కలిపి  మంచి సినిమా తయారు చేశాడు. కీరవాణిగారు తాతగారితో, నాన్నతో చేశారు. ఆయనతో కలసి పని చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మీతో నాన్న పంచుకున్న జ్ఞాపకాలు ఎప్పుడూ మాతో పంచుకుంటారు.

ఈ సినిమా షూటింగ్‌ చేస్తున్నన్ని రోజులు అమ్మాయిలు ఫోన్‌ చేసి, షూటింగ్‌కి రావచ్చా? మాధవన్‌ని చూడొచ్చా అని అడిగేవాళ్ళు. ‘చెలి’ చూసినప్పటి నా ఫ్రెండ్స్‌ ఇంకా మిమ్మల్ని  అభిమానిస్తూనే ఉన్నారు. మీరు ఈ సినిమా అంగీకరించడంతో మా నమ్మకం ఇంకా పెరిగింది. మాధవన్‌ ఓ సినిమాని ఊరికే అంగీకరించరని మాకు తెలుసు. ఏదో కొత్తదనం లేకపోతే ఆయన ఒప్పుకోరు. ని«ధీ.. నువ్వు ఇక్కడ ఉండటానికి ఎన్ని కలలు కన్నావో అవన్నీ నెరవేరాలని కోరుకుంటున్నా.  భూమికగారు, ఇలా అందరికీ థ్యాంక్స్‌. మైత్రీ బ్యానర్‌ ఈ సినిమాను మరోస్థాయికి తీసుకువెళ్లారు. మిమ్మల్ని (అభిమానులు) ఆనందపరచడం కోసం నిజాయితీగా పని చేస్తాను. నా కెరీర్‌లో ఇది పెద్ద సినిమా. కాంబినేషన్‌ని నమ్మి కాదు కంటెంట్‌ని నమ్మి సినిమా తీశారు. ఇలాంటి నిర్మాతలు మనకు కావాలి. ఈ సినిమా నిరుత్సాహపరచదు’’ అన్నారు.

 కీరవాణి మాట్లాడుతూ – ‘‘నాగార్జునగారితో పని చేయడం ఎంత ఎంజాయ్‌ చేశానో చైతన్యతో పని చేయడం కూడా అంతే ఆనందించాను. రచయితలు అందరూ చక్కటి సాహిత్యం అందించారు. నిర్మాతలు ప్రతీది అడిగి తెలుసుకున్నారు. అడిగింది ఇచ్చారు’’ అన్నారు. ‘‘శ్రీమంతుడు, జనతా గ్యారేజ్,  రంగస్థలం’ ఇలా ప్రతీ సినిమాకు నేర్చుకుంటూ, మెరుగుపరుచుకుంటూ వస్తున్నాం. శివ గారికి, విజయ్‌ దేవరకొండకి ఈ ఈవెంట్‌కి వచ్చినందుకు థ్యాంక్స్‌. చైతన్యతో ఇంకో లవ్‌ స్టోరీ సినిమా చేయాలని ఉంది. మాధవన్‌గారూ.. తెలుగు ఇండస్ట్రీకి వెల్కమ్‌. ‘బాహుబలి’ తర్వాత కీరవాణిగారు ఈ సినిమానే చేశారు’’ అని నిర్మాతలు అన్నారు.

మాధవన్‌ మాట్లాడుతూ– ‘‘మైత్రీ మూవీస్‌ వాళ్ల వల్ల స్ట్రయిట్‌ తెలుగు సినిమా చేశాను. వాళ్లు సిక్సర్‌ల మీద సిక్సర్‌లు కొడుతున్నారు. ఈ సినిమా కూడా సూపర్‌గా ఉంటుంది. సినిమాకు పని చేసిన వాళ్లందరూ సహృదయులు. ముఖ్యంగా నాగ చైతన్య. నేను మీ ఫ్యామిలీకి పెద్ద ఫ్యాన్‌ని చైతన్యా. నీతో వర్క్‌ చేయడం ఆనందంగా ఉంది. చందూతో పని చేయడం సంతోషంగా ఉంది’’ అన్నారు. ‘‘మైత్రీ బ్యానర్‌ నా ఫ్యామిలీ లానే. పెద్ద హిట్‌ సాధిస్తారనుకుంటున్నాను. పవర్‌ఫుల్‌ టైటిల్‌తో వస్తున్నారు. టీమ్‌కు ఆల్‌ ది బెస్ట్‌. చైతన్య చాలా ఇంటెన్స్‌గా కనిపిస్తున్నారు’’ అన్నారు దర్శకుడు కొరటాల శివ.

విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ –‘‘మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో రెండు సినిమాలు చేస్తున్నాను. వాళ్ల ప్యాషన్‌ అద్భుతం. మాధవన్‌గారిని తెలుగులో చూడటం ఆనందంగా ఉంది. చందూ మరో మంచి సినిమా తీశాడని అనుకుంటున్నాను. చైతన్య అంటే నాకు చాలా ఇష్టం. ఆయన హ్యాండ్‌షేక్, నవ్విన తీరుకే నచ్చేశారు. ఇండస్ట్రీలో ఎవరు చైతన్య గురించి మాట్లాడినా మంచి విషయాలే చెబుతారు. వ్యక్తిగా అంత మంచివాడు’’ అన్నారు.

‘‘ఈ అవకాశం ఇచ్చిన టీమ్‌కి థ్యాంక్స్‌. చైతూతో వర్క్‌ చేయడం హ్యాపీగా ఉంది. మాధవన్‌గారితో పని చేయడం మర్చిపోలేను’’ అన్నారు నిధి అగర్వాల్‌. రామకృష్ణ, మోనికా, రామజోగయ్య శాస్త్రి, అనంత శ్రీరామ్, కెమెరామేన్‌ యువరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top