మున్నాభాయ్ వస్తున్నాడు.. | sanjay dutt be released on february 27th | Sakshi
Sakshi News home page

మున్నాభాయ్ వస్తున్నాడు..

Jan 6 2016 11:08 AM | Updated on Sep 3 2017 3:12 PM

మున్నాభాయ్ వస్తున్నాడు..

మున్నాభాయ్ వస్తున్నాడు..

బాలీవుడ్ నటుడు సంజయ్దత్కు ఊరట లభించింది. అక్రమాయుధాల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న సంజయ్ దత్కు శిక్షను తగ్గించారు.

ముంబై: బాలీవుడ్ నటుడు సంజయ్దత్కు ఊరట లభించింది. అక్రమాయుధాల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న సంజయ్ దత్కు శిక్షను తగ్గించారు. సంజయ్కు శిక్ష తగ్గించాలన్న మహారాష్ట్ర ప్రభుత్వం సిఫారసును కేంద్ర హోం శాఖ ఆమోదించింది. ఫిబ్రవరి 27న సంజయ్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశముంది.  

అక్రమాయుధాల కేసులో దోషిగా తేలిన సంజయ్కు ఐదేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. మహారాష్ట్రలోని ఎరవాడ జైలులో ఆయన ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నారు. తీర్పు ప్రకారం సంజయ్ వచ్చే అక్టోబరు వరకు జైలుశిక్ష అనుభవించాలి. కాగా ఆయన సత్ప్రవర్తను దృష్టిలో ఉంచుకుని జైలు శిక్ష తగ్గించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసింది.

మున్నాభాయ్ సత్ప్రవర్తన..

జైలులో అత్యంత బుద్ధిమంతుడిగా ఉంటూ తోటి ఖైదీలతో స్నేహంగా మెలుగుతున్న మున్నాభాయ్ కి నెలకు ఏడు రోజులు, సంవత్సరానికి 30 రోజుల చొప్పున తన ఐదేళ్ల శిక్షాకాలంలో మొత్తం 114 రోజుల సెలవు దొరికింది. దీంతో శిక్షాకాలం నిర్ణీత గడువు కన్నా దాదాపు ఆరు నెలలముందే సంజయ్ విడుదలవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement