breaking news
Illegal weapons case
-
మనశ్శాంతిగా ఉండనివ్వరా?.. వర్మపై ఫైర్
విలక్షణ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మపై సంజయ్ దత్ సోదరి నమ్రతా దత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంజయ్ దత్ జీవితంపై వర్మ మరో బయోపిక్ తెరకెక్కిస్తానని ఈ మధ్య ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయుధాల కేసు నేపథ్యంలో ఇది ఉండబోతుందని హింట్ కూడా ఇచ్చారు. ‘సంజయ్ వద్దకు ఏకే- 56 రైఫిల్ ఎలా వచ్చింది.. అందుకు దారి తీసిన పరిస్థితుల గురించి పూసగుచ్చినట్లు వివరించే యత్నం చేస్తానని, అందుకు సంజు బాబాతోపాటు కేసును దర్యాప్తు చేసిన అధికారులను సైతం కలిసి కథను రూపొందిస్తానని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే నమ్రతా దత్ స్పందించారు. ‘అక్రమాయుధాల కేసు సంజు జీవితంలోని ఓ బాధాకరమైన ఘటన. దాన్ని వర్మ ఎందుకు తవ్వాలనుకుంటున్నారు? ఆర్జీవీ సినిమాల్లో చూపించేదంతా చీకటి కోణాలే. అలాంటప్పుడు బయోపిక్‌తో సంజును క్షోభపెట్టాలనుకుంటున్నారా? మమల్ని మళ్లీ బాధలోకి నెట్టాలని ఆయన చూస్తున్నారా? అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే సంజుకి అభ్యంతరం లేకపోతే మాత్రం తాము వర్మ ప్రయత్నానికి అడ్డుతగలబోమని ఆమె స్పష్టం చేశారు. -
ఖల్నాయక్ రిటర్న్స్
‘నాయక్ నహీ.. ఖల్నాయక్ హు మే’... 1993లో విడుదలైన సూపర్‌హిట్ సినిమా సంజయ్ దత్ ‘ఖల్నాయక్’లోని సూపర్‌హిట్ సాంగ్ ఇది. అప్పట్లో సంజయ్ పరిస్థితికి ఈ లిరిక్స్ అద్దం పట్టాయని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. అక్రమ ఆయుధాలు ఉన్నాయనే ఆరోపణలతో ఏప్రిల్ 19, 1993న అరెస్ట్ అయ్యారు. ఒక్కసారిగా సంజయ్ జీవితంలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. రీల్ లైఫ్‌లో ‘నాయక్’ అన్పించుకున్న ఈ హీరో, రియల్ లైఫ్‌లో ‘ఖల్నాయక్’ అంటూ విమర్శలపాలయ్యారు. అదే ఏడాది మే 26న ‘ఖల్నాయక్’ విడుదలై, భారీ విజయం సాధించింది. ఆ సంగతలా ఉంచితే.. అక్రమాయుధాల కేసులో సంజయ్ జైలు జీవితం గడపడం, ఆ మధ్య బయటకు రావడం తదితర విషయాలన్నీ తెలిసిందే. ఇప్పుడు సంజయ్ నాన్‌స్టాప్‌గా సినిమాలు చేయాలనుకుంటున్నారు. విశేషం ఏంటంటే... ‘ఖల్నాయక్’ సినిమా సీక్వెల్‌తోనే హీరోగా రీ-ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యారు. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో షూటింగ్ మొదలు కానుంది. ఈ సందర్భంగా ‘ఖల్నాయక్’, ఈ చిత్రం సీక్వెల్ గురించి కొన్ని విశేషాలు... సంజయ్ దత్ జైలు జీవితం పూర్తవ్వక ముందే ‘ఖల్నాయక్ రిటర్న్స్’లో తనను తాను కథానాయకునిగా ఊహించుకున్నారు. జైలు జీవితం గడిపిన సమయంలో పెరోల్ మీద బయటకొచ్చిన ఓ సందర్భంలో ఆయన్ను కలసిన దర్శక-నిర్మాత సుభాశ్ ఘై సీక్వెల్ స్టోరీ ఐడియా చెప్పగా.. సంజయ్ వాయిస్ ఓవర్‌తో కూడిన ఓ సౌండ్ ట్రాక్ రెడీ చేయించారట. ‘‘అది విన్న తర్వాత సంజయ్ ఈ చిత్రంపై ఎంత ప్యాషన్‌తో ఉన్నాడో అర్థమైంది. మరో ఆలోచన లేకుండా సీక్వెల్ తీయాలనే నిర్ణయం తీసుకున్నా’’ అని సుభాశ్ తెలిపారు. ‘ది గాడ్ ఫాదర్’ పార్ట్ 3 తరహాలో ఈతరం ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా ఈ సీక్వెల్ తీస్తామంటున్నారాయన. ‘ఖల్నాయక్’లో సంజయ్ దత్ హీరోగా నటించగా, పోలీసాఫీసర్‌గా కీలక పాత్రలో జాకీ ష్రాఫ్ పోషించారు. ఈ సీక్వెల్లో జాకీ తనయుడు టైగర్ ష్రాఫ్ నటించనున్నారని ప్రచారం జరుగుతోంది. దీనిపై సుభాశ్ ఘైను ప్రశ్నించగా.. ‘‘నటీనటులు ఎవర్నీ ఎంపిక చేయలేదు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. సీక్వెల్‌కి నేను దర్శకత్వం వహించను. త్వరలో దర్శకుణ్ణి ఎంపిక చేసి, మిగతా వివరాలు ప్రకటిస్తాం’’ అన్నారు. ఈ సీక్వెల్ కథ టూకీగా చెప్పారు సుభాశ్. ‘‘గ్యాంగ్‌స్టర్ బాలు ఇరవై ఏళ్ల తర్వాత జైలు నుంచి విడుదలై సరికొత్త ప్రపంచంలోకి అడుగుపెడతాడు. పరిస్థితుల ప్రభావం వలన మళ్లీ క్రైమ్ వరల్డ్‌లోకి వెళతాడు. అక్కడ మరో ‘ఖల్నాయక్’ ఎదురయ్యాడా? ఏం జరిగింది?’’ అనేది కథ. మల్టీస్టారర్ చిత్రంగా తెరకెక్కనుందట. ఈ కథలో కొత్త పాత్రలు ఎంటరవుతాయని సమాచారం. అప్పట్లో మార్మోగిన ‘చోళీ కే పీచే క్యా హై...’ పాట ‘ఖల్నాయక్’ చిత్రంలోనిదే. ఆ సాహిత్యం మీద తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. సంజయ్ జైలుకి వెళ్లడం, ఈ పాట సృష్టించిన అలజడి చిత్రానికి విపరీతమైన ప్రచారం తీసుకొచ్చాయి. అసలు చిత్రంలో ఏముందో? తెలుసుకోవాలని ప్రేక్షకులు ఆసక్తి చూపించారు. మరి.. ఇప్పుడు కూడా ‘చోళీ కే పీచే క్యా హై..’లాంటి పాట పెడతారా? లేక క్రేజ్ కోసం ఆ పాటనే రీమిక్స్ చేస్తారా? అనేది చూడాలి. టైటిల్ ట్రాక్ ‘నాయక్ నహీ ఖల్నాయక్ హు మే..’ని మాత్రం వాడాలనుకుంటున్నారు. వాస్తవానికి ‘ఖల్నాయక్’లో ముందు అనుకున్నది వేరే హీరోని. ప్రముఖ హిందీ నటుడు నానా పటేకర్‌ను దృష్టిలో పెట్టుకుని సుభాశ్ ఘై ‘ఖల్నాయక్’ కథ రాశారు. కానీ, అనుకోని కారణాల వలన చిత్రం పట్టాలు ఎక్కలేదు. అప్పుడు సంజయ్‌దత్ కోసం కథలో మార్పులు చేసి తీశారు. ఈ చిత్రం తెలుగులో ‘ఖైదీ నంబర్ 1’గా రీమేక్ అయ్యింది. వినోద్‌కుమార్ హీరోగా, మాధురీ దీక్షిత్ పాత్రలో సుకన్య నటించారు. ‘ఖల్నాయక్ రిటర్న్స్’తో పాటు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో మరో సినిమాలో నటించడానికి సంజయ్ దత్ అంగీకరించారు. స్క్రిప్ట్ రెడీ కావడానికి కొంత సమయం కావాలని దర్శకుడు కోరడంతో సినిమా ఆలస్యమయ్యే అవకాశాలున్నాయని ముంబయ్ సమాచారం.సంజయ్‌తోనే ‘ఢమాల్’ ఫ్రాంచైజీలో మూడో సినిమా తీయాలనుకుంటున్నట్లు దర్శకుడు ఇంద్ర కుమార్ ప్రకటించారు. సంజయ్ ఓకే అంటే.. వచ్చే ఏడాది ఆరంభించాలనుకుంటున్నారట. ఓ కమర్షియల్ సినిమాకి అవసరమైన కథ, మలుపులు, భావోద్వేగాలు.. అన్నీ సంజయ్ దత్ జీవితంలో ఉన్నాయని దర్శకుడు రాజ్‌కుమార్ హిరాని అభిప్రాయం. సంజయ్‌ను ‘మున్నాభాయ్’గా, ‘పీకే’ సినిమాలో భైరాన్ సింగ్‌గా చూపించిన ఈ దర్శకుడు, సంజయ్ జీవితకథతో సినిమా తీస్తున్నట్టు ప్రకటించారు. సంజయ్ జీవితంలో చీకటి కోణాలతో పాటు 18 ఏళ్ల నుంచి 55 ఏళ్ల వరకూ వివిధ దశలను చూపించనున్నారు. రణ్‌బీర్ కపూర్ ఈ సినిమాలో హీరోగా నటించనున్నారు. -
మున్నాభాయ్ వస్తున్నాడు..
-
మున్నాభాయ్ వస్తున్నాడు..
ముంబై: బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్‌కు ఊరట లభించింది. అక్రమాయుధాల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న సంజయ్ దత్‌కు శిక్షను తగ్గించారు. సంజయ్‌కు శిక్ష తగ్గించాలన్న మహారాష్ట్ర ప్రభుత్వం సిఫారసును కేంద్ర హోం శాఖ ఆమోదించింది. ఫిబ్రవరి 27న సంజయ్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశముంది. అక్రమాయుధాల కేసులో దోషిగా తేలిన సంజయ్‌కు ఐదేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. మహారాష్ట్రలోని ఎరవాడ జైలులో ఆయన ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నారు. తీర్పు ప్రకారం సంజయ్ వచ్చే అక్టోబరు వరకు జైలుశిక్ష అనుభవించాలి. కాగా ఆయన సత్ప్రవర్తను దృష్టిలో ఉంచుకుని జైలు శిక్ష తగ్గించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసింది. మున్నాభాయ్ సత్ప్రవర్తన.. జైలులో అత్యంత బుద్ధిమంతుడిగా ఉంటూ తోటి ఖైదీలతో స్నేహంగా మెలుగుతున్న మున్నాభాయ్ కి నెలకు ఏడు రోజులు, సంవత్సరానికి 30 రోజుల చొప్పున తన ఐదేళ్ల శిక్షాకాలంలో మొత్తం 114 రోజుల సెలవు దొరికింది. దీంతో శిక్షాకాలం నిర్ణీత గడువు కన్నా దాదాపు ఆరు నెలలముందే సంజయ్ విడుదలవుతున్నారు. -
జైలులో నాలుగు రోజులు అదనంగా గడపనున్న సంజయ్ దత్
సాక్షి, ముంబై: అక్రమ ఆయుధాలు కల్గి ఉన్న కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ప్రముఖ నటుడు సంజయ్ దత్ శిక్షా కాలాన్ని మరో నాలుగు రోజులు పొడిగించినట్లు రాష్ట్ర హోం శాఖ సహాయ మంత్రి రామ్ షిండే చెప్పారు. తనకు మంజూరైన సెలవు గడువు ముగిసినప్పటికీ రెండు రోజులు అధికంగా జైలు వెలుపలే గడిపినందుకు ఈ పరిస్థితి ఉత్పన్నమైందని అన్నారు. సంజయ్ దత్ శిక్ష అనుభవిస్తున్న పుణేలోని యేర్వాడ జైలు పరిపాలన విభాగం, స్థానిక పోలీసుల నిర్లక్ష్య వైఖరి, వారి మధ్య సమన్వయం లోపం వల్ల ఈ పరిస్థితి ఎదురైందని షిండే అన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై సంస్థాపరమైన దర్యాప్తుకు ఆదేశిస్తామని మంత్రి చెప్పారు. సంజయ్‌దత్‌కు మంజూరైన సెలవు జనవరి 8వ తేదీతో ముగిసిందని, ఆ రోజు సూర్యాస్తమయానికి ముందే ఆయన జైలులో సరెండర్ కావాల్సి ఉందని అన్నారు. అయితే తనకు మరో 14 రోజులు సెలవు మంజూరు చేయాలని కోరుతూ దాఖలు చేసుకున్న దరఖాస్తుపై జైలు అధికారులు స్పందించలేదన్నారు. దీంతో 8వ తేదీన జైలు వరకూ వచ్చిన సంజయ్ దత్‌ను సిబ్బంది వెనక్కి పంపించారు. ఆయన పెట్టుకున్న దరఖాస్తును తిరస్కరిస్తున్నట్లు జనవరి పదో తేదీన జైలు అధికారులు ప్రకటించారు. దీంతో దత్ వెంటనే జైలుకు బయలుదేరారు. కాగా ఆయన అక్రమంగా రెండు రోజులు జైలు బయట గడపడంతో నిబంధనల ప్రకారం ఆయన శిక్షా కాలంలో నాలుగు రోజులు అదనంగా జైలులో ఉండాల్సి ఉంటుంది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జైలు అధికారులు, స్థానిక పోలీసులపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు రామ్ షిండే చెప్పారు. వచ్చే అసెంబ్లీ సమావేశంలో జైలు మాన్యువల్‌లో మార్పులు చే స్తామని ఆయన చెప్పారు.