టిక్‌టాక్‌ ఛాలెంజ్‌ను స్వీకరించిన హీరోయిన్‌

Sameera Reddy Taken Tik Tok Challenge With Her Mom In Law - Sakshi

నరసింహుడు సినిమాతో టాలీవుడ్‌కు పరియయమైన సమీరారెడ్డి.. ఆ తర్వాత జై చిరంజీవ, ఆశోక్‌ వంటి చిత్రాల్లో నటించారు. తనకు సంబంధించిన విషయాలను నిత్య సోషల్‌ మీడియాలో వెల్లడిస్తూ ఉంటారు. గర్భధారణ సమయంలో, ప్రసవానంతరం ఎదుర్కొన్న శరీరాకృతి సమస్యలు, మహిళలు స్వతంత్రంగా, గౌరవంగా జీవించాలంటూ, అనేక  అంశాలను అభిమానులతో పంచుకుంటారు. తాజాగా మరోసారి సమీరా వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం టిక్‌టాక్‌లో ‘ఫ్లిప్‌ ద స్విచ్‌’ ఛాలెంజ్‌ ట్రెండ్‌ అవుతుంది. ఇది హాలీవుడ్‌లో మొదలైంది. ఇప్పటికే ఈ ఛాలెంజ్‌ను హాలీవుడ్‌ నటి జెన్నిఫర్‌ లోఫెజ్‌ స్వీకరించారు. ప్రస్తుతం ఈ ఛాలెంజ్‌ బాలీవుడ్‌లోకి ప్రవేశించింది. ఈ క్రమంలో సమీరా దీన్ని మొదటగా స్వీకరించారు. 

 "ఫ్లిప్ ది స్విచ్"..  ఈ ఛాలెంజ్‌లో ఓ వ్యక్తి  కెమెరాను పట్టుకుని అద్దం ముందు నిలబడాలి, మరొకరు ఏదైనా పాటకు నృత్యం చేస్తారు. అయితే పాట మధ్యలో వెంటనే ఇద్దరు తారుమారు అవుతారు. కెమెరా పట్టుకున్న వ్యక్తి మళ్లీ డ్యాన్స్‌ చేసిన వాళ్ల దుస్తులు వేసుకొని నృ‍త్యం చేస్తారు. ముందు డ్యాన్స్‌ చేసిన వ్యక్తి ఈ సారి వీడియో తీస్తారు. ఇవన్నీ కనురెప్ప మూసే సమయంలో జరిగినట్లు కనిపిస్తుంది. ఇక సమీరా క్వావో పాటను ఎంచుకొని, తన అత్తగారు మంజ్రీ వర్దేతో కలిసి ఈ ఛాలెంజ్‌ను పూర్తి చేశారు.

ఈ సందర్భంగా మంజ్రీ వార్దె గురించి సమీరా రెడ్డి చెపుతూ.. ‘‘అత్తగారు మీ శక్తిని దొంగిలించినప్పుడు.. ఆమె ఒక అద్భుతం. గ్యాంగ్‌స్టర్‌. ఆమె నాలాగే క్రేజీగా ఉన్నందుకు ధన్యవాదాలు.. మీరు కూడా దీన్ని తప్పకుండా ప్రయత్నించండి. అలాగే నన్ను ట్యాగ్‌ చేయండి’’ అంటూ ఇతరులకు సలహా ఇచ్చారు. కాగా సమీరా రెడ్డి 2014లో అక్షయ్ వర్దేను వివాహం చేసుకున్నారు. వీరికి 2015లో కొడుకు, 2019లో పాప పుట్టిన సంగతి తెలిసిందే. సినిమా ప్రపంచానికి గుడ్‌బై చెప్పిన సమీరా చివరగా 2013లో కన్నడ చిత్రం ‘వరదనాయక’లో కనిపించారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top