అభిమాన కోలాహలం

Samantha starts U Turn Remake shooting in Rajahmundry - Sakshi

యూ–టర్న్‌ తీసుకోవడానికి సమంత రాజమండ్రి వెళ్లారు. పవన్‌ కుమార్‌ దర్శకత్వంలో శ్రద్ధా శ్రీనాథ్, రాధిక చేతన్, దిలీప్‌ రాజ్‌ ముఖ్య తారలుగా రూపొందిన కన్నడ చిత్రం ‘యూ–టర్న్‌’. ఈ సినిమాను అదే టైటిల్‌తో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. సమంత లీడ్‌ రోల్‌ చేస్తోన్న ఈ సినిమాకి పవన్‌కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఆది పినిశెట్టి, రాహుల్‌ రవీంద్రన్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారని సమాచారం.

ఈ సినిమా షూటింగ్‌ శనివారం రాజమడ్రిలో ప్రారంభమైంది. అయితే.. సమంతను చూడటానికి చాలా మంది అభిమానులు అక్కడికి వచ్చారు. దీంతో అక్కడంతా కోలాహలం నెలకొంది. వారి అభిమానానికి ఫిదా అయ్యారు సమంత. ‘‘యూ–టర్న్‌’ సినిమా స్టారై్టంది. అభిమానుల ప్రేమ నన్ను మరింత ప్రోత్సహిస్తోంది. మూవీని మరింత బాగా తీయడంలో నాకు ప్రేరణ కల్పిస్తోంది’’ అని పేర్కొన్నారు సమంత.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top