క్షణంలా గూఢచారి హిట్‌ అవ్వాలి | Samantha Akkineni at Goodachari Teaser Launch | Sakshi
Sakshi News home page

క్షణంలా గూఢచారి హిట్‌ అవ్వాలి

Jul 6 2018 12:48 AM | Updated on Jul 14 2019 4:31 PM

Samantha Akkineni at Goodachari Teaser Launch - Sakshi

వివేక్‌ కూచిభొట్ల, అభిషేక్‌ నామా, సమంత, అడవి శేష్, అనిల్‌ సుంకర, శశికిరణ్‌

‘‘గూఢచారి’ చిత్రం టీజర్‌ చాలా బాగుంది. సినిమా హై బడ్జెట్‌లో తీసినట్లు రిచ్‌గా ఉంది. ఈ చిత్రం టీజర్‌ లాంచ్‌ చెయ్యడం వెరీ హ్యాపీ. ‘క్షణం’ సినిమాలాగే ‘గూఢచారి’ కూడా పెద్ద హిట్‌ అవ్వాలి. ఈ సినిమా కోసం అందరిలాగే నేనూ వేచి చేస్తున్నా’’ అని కథానాయిక సమంత అన్నారు. అడవి శేష్‌ హీరోగా శశికిరణ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గూఢచారి’. ఈ చిత్రం ద్వారా తెలుగమ్మాయి, మోడల్‌ శోభిత హీరోయిన్‌గా పరిచయమవుతున్నారు. అభిషేక్‌ నామా, టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మించిన ఈ సినిమా టీజర్‌ని సమంత విడుదల చేసారు. అడవి శేష్‌ మాట్లాడుతూ– ‘‘డైరెక్టర్‌ శశి ఈ సినిమాను గొప్పగా తెరకెక్కించారు. విజువల్స్‌ ప్రేక్షకులను అలరిస్తాయి.

168 లొకేషన్స్‌లో ఈ చిత్రం తీశాం. మంచి బడ్జెట్‌ ఇచ్చి మాకు సహకరించిన నిర్మాతలకు థ్యాంక్స్‌. ‘గూఢచారి’ సినిమా ప్రేక్షకులను థ్రిల్‌ చేయబోతోంది’’ అన్నారు. ‘‘ఈ సినిమా చెయ్యడానికి సహకరించిన నిర్మాతలకు, టెక్నీషియన్స్‌కు కృతజ్ఞతలు. సినిమా బాగా వచ్చింది. టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది’’ అన్నారు శశికిరణ్‌. ‘‘160 రోజుల్లో ఈ సినిమా చిత్రీకరించాం. అవుట్‌పుట్‌ చూసా. సినిమా బాగా వచ్చింది. ఆగస్టు 3న రిలీజ్‌ చేస్తున్నాం’’ అన్నారు అభిషేక్‌ నామా. నిర్మాత అనిల్‌ సుంకర, మాటల రచయిత అబ్బూరి రవి పాల్గొన్నారు. ఈ చిత్రానికి  కెమెరా: శనీల్‌ డియో, సంగీతం: శ్రీ చరణ్‌ పాకాల, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: కిట్టు సూర్యన్, సహ నిర్మాత: వివేక్‌ కూచిభొట్ల.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement