సాల్ట్, పెప్పర్‌ గెటప్‌లో నటించా | Salt, pepper acted in the getup | Sakshi
Sakshi News home page

సాల్ట్, పెప్పర్‌ గెటప్‌లో నటించా

Jul 29 2017 3:50 AM | Updated on Sep 5 2017 5:05 PM

సాల్ట్, పెప్పర్‌ గెటప్‌లో నటించా

సాల్ట్, పెప్పర్‌ గెటప్‌లో నటించా

నిపుణన్‌ చిత్రంలో సాల్ట్‌ అండ్‌ పెప్పర్‌ గెటప్‌లో నటించానని యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ తెలిపారు.

తమిళసినిమా: నిపుణన్‌ చిత్రంలో సాల్ట్‌ అండ్‌ పెప్పర్‌ గెటప్‌లో నటించానని యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ తెలిపారు. ఇటీవల స్టార్‌ హీరోలు సాల్ట్‌ అండ్‌ పెప్పర్‌ గెటప్‌లో కనిపించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ మధ్యకాలంలో నటుడు అజిత్‌ ఎక్కువగా తన చిత్రాల్లో సహజత్వంతో కూడిన పాత్రల్లో సాల్ట్‌ పెప్పర్‌ గెటప్‌లో కనిపించి అభిమానుల్ని అలరిస్తున్నారు. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కూడా కబాలి చిత్రంలో అలాంటి గెటప్‌లోనే ఆకట్టుకున్నారు. తాజాగా నటిస్తున్న కాలా చిత్రంలోనూ రజనీకాంత్‌ను సాల్ట్‌ అండ్‌ పెప్పర్‌ గెటప్‌లోనే నటిస్తున్నారు. ఇక యాక్షన్‌కింగ్‌ అర్జున్‌ తన తాజా చిత్రం నిపుణన్‌లో సాల్ట్‌ అండ్‌ పెప్పర్‌ గెటప్‌లో నటించారు. విశేషం ఏమిటంటే ఇది అర్జున్‌కు 150వ చిత్రం.

అరుణ్‌ వైద్యనాథన్‌ దర్శకత్వం వహించిన ఇందులో ప్రసన్న, వరలక్ష్మీశరత్‌కుమార్, వైభవ్, కృష్ణ ముఖ్య పాత్రలు పోషించారు.ఈ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా నటుడు అర్జున్‌ తన అనుభవాలను తెలుపుతూ తన సినీ పయనంలో ఒక్కో తరుణంలో ప్రేమాభిమానాలను అందుకోవడంతో పాటు, పలు ఆటంకాలను ఎదుర్కొన్నానన్నారు. చాలా పోలీస్‌ పాత్రల్లో నటించానన్నారు. నిపుణన్‌ చిత్రంలోనూ డీఎస్పీగా సాల్ట్‌ అండ్‌ పెప్పర్‌ గెటప్‌లో వైవిధ్యభరిత పాత్రను పోషించానని చెప్పారు. ఈ చిత్ర కథనాన్ని దర్శకుడు అరుణ్‌ వైద్యనాథన్‌ కొత్త కోణంలో నడిపించారని ప్రశంసించారు.

ఆయన ముందుగానే చాలా హోమ్‌వర్క్‌ చేసి షూటింగ్‌ స్పాట్‌లో చాలా నేర్పుగా తన పనితనాన్ని నిరూపించుకున్నారని అన్నారు. తనతో పాటు నటించిన ప్రసన్న, వరలక్ష్మీశరత్‌కుమార్, శ్రుతీ హరిహర న్, వైభవ్‌ ఇలా అందరూ తమ పనిని పర్ఫెక్ట్‌గా నిర్వహించారని చెప్పారు. విజయానికి కావలసిన అన్ని అంశాలు ఉన్న నిపుణన్‌ కచ్చితంగా ప్రేక్షకుల ఆదరణను పొందుతుందనే నమ్మకం తనకుందని అర్జున్‌ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement