నిహాల్, ప్రియా దేశ్‌పాగ్, అర్జున్ దేవ్, కాజల్ తివారి, జీవ కోచెర్ల, నవీన్ రాజ్, చిట్టిబాబు, ఆనంద్ భారతి, రైజింగ్ రాజు, అ΄్పారావు, నాగి ముఖ్య తారలుగా నటించిన చిత్రం ‘సందిగ్ధం’. పార్థసారధి కొమ్మోజు దర్శకత్వంలో సంధ్య తిరువీధుల నిర్మించారు. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌కి నటుడు, నిర్మాత అశోక్ కుమార్ అతిథిగా హాజరయ్యారు.
టీజర్‌ని రిలీజ్ చేసిన అనంతరం అశోక్ కుమార్ మాట్లాడుతూ– ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో పది, పదిహేను కోట్ల రూపాయలు లేకపోతే సినిమా తీయలేకపోతున్నారు. అలాగే కరోనా తర్వాత పరిస్థితులు మారిపోయాయి. మంచి టాక్ వస్తేనే జనాలు థియేటర్లకు వస్తున్నారు. ‘సందిగ్ధం’ టీజర్ గ్రిప్పింగ్‌గా ఉంది. ఈ చిత్రం సక్సెస్ అవ్వాలి’’ అన్నారు.
పార్థసారధి కొమ్మోజు మాట్లాడుతూ– ‘‘సస్పెన్స్, క్రైమ్, థ్రిల్ నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘సందిగ్ధం’. ఇలాంటి కథ ఇంతవరకు రాలేదని చెప్పవచ్చు. నన్ను దర్శకుణ్ణి చేయాలని ఎంతో కష్టపడి ఈ సినిమాను నిర్మించారు నా భార్య సంధ్య’’ అని చెప్పారు. ‘‘మా ‘సందిగ్ధం’ చిత్రాన్ని అందరూ ఆదరించాలి’’ అని నిహాల్, అర్జున్ దేవ్, ప్రియా దేశ్΄ాగ్, సంగీత దర్శకుడు గౌతమ్, నటులు నవీన్ రాజు, నరసింహ రాజు కోరారు.


