సెన్సేషనల్‌ హిట్‌ సాధించాం అనిపిస్తోంది – సి. కల్యాణ్‌ | Sai Dharam Tej's Intelligent Teaser | Sakshi
Sakshi News home page

సెన్సేషనల్‌ హిట్‌ సాధించాం అనిపిస్తోంది – సి. కల్యాణ్‌

Jan 28 2018 1:28 AM | Updated on Aug 29 2018 1:59 PM

Sai Dharam Tej's Intelligent Teaser - Sakshi

ఆకుల శివ, సి. కల్యాణ్, వినాయక్, బాలకృష్ణ, సాయిధరమ్‌ తేజ్, సీవీ రావు

‘‘ఆర్టిస్టుల నుంచి ఎలా నటన రాబట్టుకోవాలో వినాయక్‌కి బాగా తెలుసు. ఆయన దర్శకత్వంలో మెగా ఫ్యామిలీ నుంచి మరో నటవారసుడు సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా రూపొందిన ‘ఇంటిలిజెంట్‌’ హిట్‌ అవ్వాలి. సీకే ఎంటర్‌టైమెంట్స్‌ నా సొంత బేనర్‌తో సమానం. కళ్యాణ్‌గారు పెద్ద హీరోలతో, చిన్న హీరోలతో ఇంకా సినిమా చేయాలి. ఈ సినిమా విషయానికి వస్తే వినాయక్, ఆకుల శివ కాంబినేషన్‌లో ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చాయి. టీజర్‌ చాలా బాగుంది.

సినిమా ఎప్పుడు చూడాలా అనిపిస్తోంది. మెగా అభిమానులకు, ఇది నా బేనర్‌ కాబట్టి నా అభిమానులకు, ముఖ్యంగా యూత్‌కి ఈ సినిమా కనెక్ట్‌ అవుతుంది’’ అన్నారు హీరో బాలకృష. సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా వీవీ వినాయక్‌ దర్శకత్వంలో సి.కె.ఎంటర్‌టైమెంట్స్‌పై సి. కల్యాణ్‌ నిర్మిస్తున్న చిత్రం ‘ఇంటిలిజెంట్‌’. ఈ చిత్రం టీజర్‌ను బాలకృష్ణ విడుదల చేశారు. సి.కళ్యాణ్‌ మాట్లాడుతూ– ‘‘మా బాలయ్యబాబు టీజర్‌ రిలీజ్‌ చేయడంతో నేను పెద్ద సెన్సేషన్‌ హిట్‌ సాధించినట్లుగా భావిస్తున్నాను. 2018 ప్రారంభంలో బాలకృష్ణగారు ‘జై సింహా’ హిట్‌ రూపంలో నాకు మంచి ఎనర్జీ ఇచ్చారు.

ఫిబ్రవరిలో రిలీజ్‌ కాబోతున్న ‘ఇంటిలిజెంట్‌’ సూపర్‌హిట్‌ గ్యారంటీ’’ అన్నారు. ‘‘మేం అడగ్గానే బాలకృష్ణగారు రావడంతో ఈ సినిమా సూపర్‌హిట్‌ అయిపోయిందన్న ఫీలింగ్‌ వచ్చేసింది’’ అన్నారు వినాయక్‌. ‘‘కొత్త టాలెంట్‌ని ఎంకరేజ్‌ చెయ్యడానికి బాలకృష్ణగారు ముందుంటారని అందరూ అంటారు. మా సినిమాకి ఆశీస్సులు అందించడానికి రావడంతో మరోసారి అది ప్రూవ్‌ అయ్యింది’’ అన్నారు సాయిధరమ్‌ తేజ్‌. ఫిబ్రవరి 4న ఈ చిత్రం ప్రీ–రిలీజ్‌ వేడుకను రాజమండ్రిలో జరపాలనుకుంటున్నారు. ఈ చిత్రానికి కథ, మాటలు: శివ ఆకుల, సహ నిర్మాతలు: సి.వి.రావు, నాగరాజ పత్సా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement