ఇంటికో జవాన్‌ | Sai Dharam Tej to play RSS member in 'Jawaan', not an Indian Army | Sakshi
Sakshi News home page

ఇంటికో జవాన్‌

Oct 23 2017 7:04 AM | Updated on Oct 23 2017 7:04 AM

Sai Dharam Tej to play RSS member in 'Jawaan', not an Indian Army

దేశానికి జవాన్‌ చాలా అవసరం. అలాగే, ప్రతి ఇంటికి జవాన్‌ లాంటి కొడుకు ఒకడు ఉండాలి అనే కథాంశంతో రూపొందిన సినిమా ‘జవాన్‌’. ‘ఇంటికొక్కడు’ అన్నది ఉపశీర్షిక. సాయిధరమ్‌ తేజ్, మెహరీన్‌ జంటగా బీవీయస్‌ రవి దర్శకత్వంలో ‘దిల్‌’ రాజు సమర్పణలో కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. తమన్‌ స్వరాలు అందించారు. ఈ సినిమా థీమ్‌ సాంగును ఇటీవల సాయిధరమ్‌ తేజ్‌ బర్త్‌డే సందర్భంగా విడుదల చేశారు.

బీవీయస్‌ రవి మాట్లాడుతూ– ‘‘ఓ మధ్య తరగతి యువకుడు తన కుటుంబాన్ని మనోధైర్యంతో, బుద్ధి బలంతో ఎలా కాపాడుకున్నాడన్నదే జవాన్‌ కథ. అందుకే ఇంటికొక్కడు అనే క్యాప్షన్‌ పెట్టాం. పక్కా ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన ఎంటర్‌టైనింగ్‌ కమర్షియల్‌ మూవీ. తమన్‌ మంచి పాటలిచ్చారు. ఇటీవల విడుదల చేసిన పాటలకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. డిసెంబర్‌ 1న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement