కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌

Sahoo Third Schedule in Hyderabad - Sakshi

బుల్లెట్ల వర్షం కురిసింది. కార్లు, ట్రక్కులు క్రాష్‌ అయ్యాయి. దాదాపు 70 కోట్లు ఖర్చు అయ్యాయి. ఇదీ సింపుల్‌గా దుబాయ్‌లో జరిగిన ‘సాహో’ సెకండ్‌ షెడ్యూల్‌ గురించి. మరి..నెక్ట్స్‌ షెడ్యూల్‌లో ఏం ప్లాన్‌ చేశారు? అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటే మాత్రం మరో పది రోజులు ఆగాల్సిందే. అంటే థర్డ్‌ షెడ్యూల్‌కి కౌంట్‌డౌన్‌ మొదలైంది అని చెబుతున్నాం. ప్రభాస్‌ హీరోగా సుజిత్‌ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్న సినిమా ‘సాహో’. శ్రద్ధా కపూర్‌ కథానాయిక. ఈ సినిమా మూడో షెడ్యూల్‌ వచ్చే నెల 11 నుంచి హైదరాబాద్‌లో మొదలు కానుంది.

ప్రభాస్‌తో పాటు ముఖ్య తారలపై కీలక సన్నివేశాల చిత్రీకరణను ప్లాన్‌ చేశారని సమాచారం.‘‘అబుదాబిలో సెకండ్‌ షెడ్యూల్‌ను కంప్లీట్‌ చేశాం. జూలై 11నుంచి హైదరాబాద్‌లో థర్డ్‌ షెడ్యూల్‌ స్టార్ట్‌ అవుతుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. నీల్‌ నితిన్‌ ముఖేష్, అరుణ్‌ విజయ్, లాల్, ఎవెలిన్‌ శర్మ తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్న ‘సాహో’ సినిమాకు బాలీవుడ్‌ త్రయం శంకర్, ఎహసాన్, లాయ్‌ సంగీతం అందిస్తున్నారు. దాదాపు 300 కోట్ల బడ్జెట్‌తో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top