20 నిమిషాలు.. 40 కోట్లు.. 50 రోజులు

Sahoo Action Sequences SHoot At Dubai - Sakshi

కార్లు గాల్లో ఎగరటానికి కొబ్బరికాయ కొట్టేశారు.. బాంబులు బ్లాస్ట్‌ అవ్వడానికి బోణీ చేసేశారు  ‘సాహో’ చిత్రబృందం. ప్రభాస్‌ హీరోగా ‘రన్‌ రాజా రన్‌’ ఫేమ్‌ సుజిత్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ ‘సాహో’. శ్రద్ధాకపూర్‌ కథానాయిక. యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కీలకమైన కార్‌ చేజ్‌ సీక్వెన్స్‌ను దుబాయ్‌లో శనివారం స్టార్ట్‌ చేశారు. 20 నిమిషాల ఈ చేజ్‌ కోసం దాదాపు 40 కోట్లు ఖర్చు పెట్టనున్నారట చిత్రబృందం. ఈ ఫైట్‌ సీక్వెన్స్‌ను సుమారు 50 రోజులు షూట్‌ చేస్తారని సమాచారం.

అంటే.. 50 రోజుల పాటు ప్రభాస్‌ ఇండియాలో ఉండరన్నమాట. హాలీవుడ్‌ స్టంట్‌ కొరియోగ్రాఫర్‌ కెన్నీ బేట్స్‌ ఈ స్పెషల్‌ ఫైట్‌ సీక్వెన్స్‌ను డిజైన్‌ చేశారు. సాబు సిరిల్‌ ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ టీమ్‌ గత నెలరోజుల నుంచి దుబాయ్‌లోనే ఉంటున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా 2019లో రిలీజ్‌ కానుంది. బాలీవుడ్‌ నటుడు నీల్‌ నితిన్‌ ముఖేశ్, అరుణ్‌ విజయ్, ఎవెలిన్‌ శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకి సంగీతం శంకర్‌–ఎహాసన్‌–లాయ్, కెమెరా:మది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top