
బాలీవుడ్‌లో హీరోయిన్ తాప్సీ సత్తా చాటుతుంది. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేస్తూ తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది ఈ ఢిల్లీ బ్యూటీ. గతేడాది విడుదలైన ‘సాంఢ్ కీ ఆంఖ్’ సినిమాకి సంబంధించి ఫస్ట్ ట్రయల్ లుక్‌ను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఈ సినిమా తనకెంతో ప్రత్యేకమని, తనకెన్నో మధురమైన ఙ్ఞాపకాలు ఉన్నాయంటూ తెలిపింది. “నా కెరీర్లోనే నేను చేసిన అతిపెద్ద ప్రయోగం ఇది. మొదటిసారి డైరెక్టర్‌గా తుషార్ హీరానందాని, తొలిసారి నిర్మాతగా నిధి పార్మర్హిరా, ఇక కెరీర్లోనే మొదటిసారి ఇద్దరు నటీమణులు తమ వయసుకు మించిన పాత్రల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాలో ఎంతోమంది మొదటిసారిగా బాలీవుడ్ స్ర్కీన్‌పై తమ అదృష్టం పరీక్షించుకున్నారు. ఈ సినిమాతో నాకెన్నో మధురమైన ఙ్ఞాపకాలు ఉన్నాయి అంటూ ఎమోషనల్ అయ్యింది.
దాదాపు 30కి పైగా జాతీయ ఛాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొన్న భారత మాజీ షూటర్లు చంద్రో తోమర్, ప్రకాశి తోమర్ల జీవితకథ ఆధారంగా ‘సాంఢ్ కీ ఆంఖ్’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇక ప్రకాశి తోమర్ పాత్రలో తాప్సి నటించగా, భూమి ఫెడ్నేకర్ చంద్రో తోమర్ పాత్రను పోషించారు. 2019 అక్టోబర్‌లో విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. (నెక్ట్స్ షారుక్ నేనే అనుకున్నా.. కానీ: నటుడు)