సమ్మర్‌లో సాహో?

saaho release on next year april last week - Sakshi

హాటైన సమ్మర్‌లో దీటైన యాక్షన్‌తో థియేటర్‌లోకి వచ్చి ఆడియన్స్‌ను కూల్‌ చేయాలనుకుంటున్నారట ‘సాహో’ టీమ్‌. ప్రభాస్‌ హీరోగా సుజీత్‌ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్న సినిమా ‘సాహో’. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమాలో శ్రద్ధా కపూర్‌ కథానాయిక. ప్రస్తుతం ఈ సినిమాలో కీలకమైన మూడో షెడ్యూల్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. గతేడాది ‘బాహుబలి–2’ రిలీజ్‌ టైమ్‌లో ‘సాహో’ టీజర్‌ను రిలీజ్‌ చేశారు. ‘ఇన్‌ థియేటర్స్‌ 2018’ అని టీజర్‌ చివర్లో వస్తుంది.

కానీ, ఈ సినిమా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రాదని ఆల్రెడీ చిత్రబృందం పేర్కొంది. మరి రిలీజ్‌ ఎప్పుడు? అంటే వచ్చే ఏడాది ఏప్రిల్‌ లాస్ట్‌ వీక్‌లో అనే వార్తలు వినిపిస్తున్నాయి. ‘బాహుబలి –2’ కూడా ఏప్రిల్‌ 28న విడుదలైంది. సో.. ఈ సెంటిమెంట్‌గా కూడా ఆలోచిస్తున్నారట టీమ్‌. గత ఏడాది ప్రభాస్‌ బర్త్‌ డే సందర్భగా ‘సాహో’ ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ అయ్యింది. ఈ ఏడాది బర్త్‌డేకి సెకండ్‌ టీజర్‌ విడుదల కానుందన్న ప్రచారం జరుగుతోంది. అరుణ్‌ విజయ్, నీల్‌ నితిన్‌ ముఖేష్, ఎవెలిన్‌ శర్మ, మురళీ శర్మ నటిస్తున్న ఈ చిత్రానికి బాలీవుడ్‌ త్రయం శంకర్‌–ఎహాసన్‌–లాయ్‌ సంగీతం అందిస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top