అఖిల్‌-క్రిష్‌ కాంబోలో మూవీ!

Rumors On Akhil Akkineni And Krish jagarlamudi Movie - Sakshi

చేసిన మూడు సినిమాలు సరైన ఫలితాలు ఇవ్వకపోవడంతో డైలామాలో పడ్డాడు అక్కినేని యువ హీరో అఖిల్‌. ‘మిస్టర్‌ మజ్ను’తో ఎలాగైనా హిట్‌కొట్టాలని ప్రయత్నించగా.. ఆశించిన విజయాన్ని మాత్రం ఇవ్వలేకపోయింది. ఇక అఖిల్‌ నాల్గో సినిమాపై ఇప్పటికే జోరుగా ప్రచారం సాగుతోంది. 

అఖిల్‌ నాల్లో సినిమా శ్రీనువైట్లతో ఉంటుందని రూమర్స్‌ వినిపించగా.. మళ్లీ మలుపు దర్శకుడు సత్య పేరు తెరపైకి వచ్చింది. అయితే తాజాగా వినిపిస్తున్న పేరు క్రిష్‌. అవును.. నాగ్‌కు ఈ మధ్యేకథ వినిపించాడని.. అది నచ్చడంతో అఖిల్‌తో సినిమా దాదాపుగా ఫిక్స్‌ చేసినట్టే అనే టాక్‌ వినిపిస్తోంది. అసలే క్రిష్‌ మణికర్ణిక వివాదం, మహానాయకుడు మూవీతో సతమతమవుతుంటే.. మరి ఈ విషయంపై ఎప్పుడు స్పందిస్తాడో చూడాలి. అఖిల్‌ తన తదుపరి చిత్రాన్ని అధికారికంగా  ప్రకటించేవరకు వేచి చూడాల్సిందే. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top