ఆర్టీఏ సేవలన్నీ ఆన్‌లైన్‌లోనే.. | RTA Services in Online.. | Sakshi
Sakshi News home page

ఆర్టీఏ సేవలన్నీ ఆన్‌లైన్‌లోనే..

Jul 17 2016 11:11 PM | Updated on Sep 4 2017 5:07 AM

రవాణా శాఖకు సంబంధించిన అన్ని సేవలు ఆగస్టు 2 నుంచి ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తామని జిల్లా రవాణా శాఖ అధికారులు ప్రకటించారు.

  • ఆగస్టు 2 నుంచి అందుబాటులోకి
  • మొదలైన స్లాట్‌ బుకింగ్‌
  • అయినా దళారులదే హవా!
  • సంగారెడ్డి టౌన్‌: రవాణా శాఖకు సంబంధించిన అన్ని సేవలు ఆగస్టు 2 నుంచి ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తామని జిల్లా రవాణా శాఖ అధికారులు ప్రకటించారు. రెండు రోజుల క్రితమే ఆన్‌లైన్‌ స్లాట్‌ బుక్‌ ప్రారంభమైంది. డ్రైవింగ్‌ లైసెన్సుల మాదిరిగానే వాహన రిజిస్ట్రేషన్లు, యాజ మాన్య బదిలీ, చిరునామా మార్పిడి, రెన్యువల్, డూప్లికేట్‌ తదితర సేవల కోసం ఎవరైనా ఆన్‌లైన్‌లోనే స్లాట్‌ పొందాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న నిర్దేశిత సమయానకి కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది. ఆర్టీఏ వెబ్‌సైట్‌లో అవసరమైన సేవలకు సంబంధించి వివరాలు నమోదు చేసుకున్న తర్వాత కంప్యూటర్‌ ఒక అప్లికేషన్‌ నంబరును సదరు అభ్యర్థికి కేటాయిస్తుంది.  దాని సమాచారం సదరు వ్యక్తి మొబైల్‌ నంబరుకు ఎస్‌ఎంఎస్‌ ద్వారా వస్తుంది. సంబంధిత ఫీజు ఆన్‌లైన్‌లో కాని, ఈసేవ, మీ సేవలో కానీ చెల్లించి, నిర్ణీత స్లాట్‌ రోజున అవసరమైన ధ్రువపత్రాలను కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. కార్యాలయంలో అభ్యర్థి ఫొటో, సంతకం, వేలిముద్రలు తీసుకొని అభ్యర్థికి అవసరమైన సేవలు అందిస్తారు.
    దళారుల బెడద తప్పేనా...?
    డ్రైవింగ్‌ లైసెన్సుల సేవలు గత ఏడాది నుంచి ఆన్‌లైన్‌లోనే అందిస్తున్నారు. ఆన్‌లైన్‌ ద్వారా సేవలు పారదర్శకంగా జరుగుతున్నాయా అంటే లేదనే సమాధానం వస్తోంది. ఆన్‌లైన్‌ స్లాట్‌ పొందినా దళారుల ద్వారా వెళ్లిన వారికే పని తర్వగా పూర్తవుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. స్లాట్‌ పొంది లైన్‌లో గంటల తరబడి నిల్చున్నా పట్టికోని అధికారులు, దళారుల ద్వారా వెళ్లిన వారికి వెంటనే పని పూర్తవుతోందని చెప్పారు. అన్ని సేవలు ఆన్‌లైన్‌లో అందించినా దళారుల బెదడ తప్పేట్టు లేదని పలువు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement