బిగ్‌బాస్‌: రోల్‌రైడా ప్యాకప్‌

Roll Rida Eliminated in Bigg Boss Telugu 2 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : బిగ్‌బాస్‌ షో క్లైమాక్స్‌కు వచ్చేసింది. మిగిలింది ఈ ఒక్క వారమే. ఇప్పటికే సామ్రాట్‌ హౌస్‌మెట్స్‌ మద్దతుతో డైరెక్ట్‌గా ఫైనల్‌కు చేరాడు. ఈ నేపథ్యంలో ఈ వారం ఎలిమినేట్‌ అయ్యేది ఎవరు? ఫైనల్‌కు వెళ్లే వారు ఎవరని ప్రేక్షకులు తీవ్రంగా ఆలోచిస్తున్నారు. అయితే అందరూ ఊహించినట్టే  రోల్‌రైడా ఈ వారం హౌస్‌ను వీడాడు. ఇన్ని రోజులైనా హౌస్‌మేట్స్‌ ఇంటి రూల్స్‌ సరిగ్గా పాటించకపోవడంతో బిగ్‌బాస్‌ ఈ వారం అందరిని నామినేట్‌ చేసిన విషయం తెలిసిందే. నామినేట్‌ అయిన వారిలో సామ్రాట్‌, రోల్‌రైడాలకే ప్రేక్షకుల నుంచి తక్కువగా ఓట్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక సామ్రాట్‌ ఫైనల్‌కు అర్హత సాధించడంతో ఈ వీక్‌ ఎలిమినేషన్‌ నుంచి తప్పించుకున్నాడు. దీంతో రోల్‌రైడా హౌస్‌ను వీడక తప్పలేదు.

రైడా ఎలిమినేషన్‌కు కారణం..
నిజానికి రోల్‌రైడా తన గొయ్యిని తనే తవ్వుకున్నాడు. షో ఆరంభం నుంచి సేఫ్‌ గేమ్‌ ఆడుతూ వచ్చిన రైడా ఎంత సేపు హౌస్‌ మేట్స్‌ మద్దతు కోసమే ప్రయత్నించాడే తప్పా ప్రేక్షకులు ఎలా అర్థం చేసుకుంటున్నారో అర్థం చేసుకోలేకపోయాడు. ఎక్కువ సార్లు నామినేషన్‌కు రాకపోవడం కూడా రైడాకు ప్రతికూలం అయింది. ఇక ఫైనల్‌కు వెళ్లే సదవకాశాన్ని కూడా రైడా పొగట్టుకున్నాడు. ఎగ్స్‌ టాస్క్‌లో కౌశల్‌ మినహా రైడాకు ఎవరు మద్దతివ్వలేదు. దీంతో రైడా ఈ టాస్క్‌లో ఓడిపోవడంతో సామ్రాట్‌ తంతే బూరేల బుట్టలో పడ్డట్లు ఫైనల్‌కు చేరాడు. నిజానికి సామ్రాట్‌  కేవలం రెండు సార్లు మాత్రమే నామినేషన్‌లోకి వచ్చాడు. అప్పుడు కూడా చాలా తక్కువ ఓటింగ్‌తోనే గట్టెక్కాడు. రోల్‌రైడా సామ్రాట్‌ను కూడా ఫైనల్‌కు వెళ్లకుండా అడ్డుకుని ఉంటే అతనికి ఈ పరిస్థితి వచ్చేది కాదని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. 

కౌశల్‌తో గొడవ కూడా రోల్‌రైడాపై మరింత వ్యతిరేకతను పెంచింది. సంబంధంలేని వ్యాఖ్యలు చేస్తూ గొడవ పెద్దదయ్యేందుకు మరింత ఆజ్యం పోశాడు. ఇది కూడా ప్రేక్షకులకు అంతగా నచ్చలేదు. పైగా గల్లీ పోరడు అని చెప్పుకునే రైడా ఆ గొడవ సందర్భంగా కౌశల్‌ కాళ్లు పట్టుకోవడం, ఏడ్వడం వారందరికి వెగటు పుట్టించింది. ఇదే అంశంపై శనివారం హోస్ట్‌నాని సైతం రైడాను మందలించాడు. (చదవండి: కౌశల్‌ ఆర్మీ భారీ ర్యాలీ)

బిగ్‌బాస్‌కు కింగ్‌ నాగార్జున..
నేటి ప్రోమోను చూస్తే బిగ్‌బాస్‌ సెట్‌లో దేవదాస్‌ యూనిట్‌ సందడి చేసినట్లు తెలుస్తోంది. ఈ షో హోస్ట్‌ నాని, కింగ్‌ నాగార్జున కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘దేవదాస్‌’   సెప్టెంబర్‌ 27న ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్‌లో భాగంగా కింగ్‌ నాగర్జునతో పాటు హీరోయిన్స్‌ రష్మికా మండన్నా, ఆకాంక్షసింగ్‌లు బిగ్‌బాస్‌ సెట్‌లో సందడి చేశారు.  

చదవండి: మరిన్ని బిగ్‌బాస్‌ ముచ్చట్లు 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top