
పీకే సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నా!
త్వరలో విడుదల కానున్న అమిర్ ఖాన్ 'పీకే' చిత్రం పట్ల టెన్నిస్ స్టార్ రోజరర్ ఫెదరర్ కూడా ఆకర్షితుడయ్యాడు.
ముంబై: త్వరలో విడుదల కానున్న అమిర్ ఖాన్ 'పీకే' చిత్రం పట్ల టెన్నిస్ స్టార్ రోజరర్ ఫెదరర్ కూడా ఆకర్షితుడయ్యాడు. అమిర్ ఖాన్, అనుష్క శర్మల కాంబినేషన్లో రానున్న 'పీకే' సినిమాను వీక్షించడానికి ఎదరుచూస్తున్నట్లు ఫెదరర్ స్పష్టం చేశాడు. ఆ సినిమాకు సంబంధించి అమిర్ విడుదల చేసిన తొలి పోస్టర్ తనలో ఆసక్తిని మరింత ఇందుకు కారణమన్నాడు. అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్) లో భాగంగా అమిర్ తో కలిసి ఫ్రెండ్లీ మ్యాచ్ లో ఆడిన ఫెదరర్ తన మనసులో విషయాన్ని బయటపెట్టాడు.
'నేను పీకే సినిమాను వీక్షించడానికి ఆతృతగా ఎదురుచూస్తున్నాను. ఆ చిత్ర తొలి పోస్టర్ నాలో ఆసక్తిని పెంచింది. ఈ సినిమాను అమిర్ కలిసి చూడాలని ఉంది' అని ఫెదరర్ స్పష్టం చేశాడు. ఈనెల 19వ తేదీన విడుదల కానున్న ఈ చిత్రంలో అమిర్ విభిన్న పాత్రలో కనిపించనున్నాడు.