సచిన్ కోసం 'పీకే' స్పెషల్ షో! | Aamir to host special screening of 'PK' for Sachin Tendulkar | Sakshi
Sakshi News home page

సచిన్ కోసం 'పీకే' స్పెషల్ షో!

Dec 11 2014 9:50 PM | Updated on Apr 3 2019 6:23 PM

సచిన్ కోసం 'పీకే' స్పెషల్ షో! - Sakshi

సచిన్ కోసం 'పీకే' స్పెషల్ షో!

అమిర్ ఖాన్ హీరోగా నటించిన 'పీకే' సినిమా విడుదల కోసం వేచి చూసే ప్రముఖ వ్యక్తుల్లో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కూడా జాయిన్ అయ్యాడు.

న్యూఢిల్లీ: అమిర్ ఖాన్ హీరోగా నటించిన 'పీకే' సినిమా విడుదల కోసం  వేచి చూసే ప్రముఖ వ్యక్తుల్లో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కూడా జాయిన్ అయ్యాడు. రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కోసం సినీ అభిమానులతో పాటు, పలువురు క్రీడాకారులు కూడా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పీకే సినిమా విడుదల కోసం టెన్నిస్ స్టార్ ఆటగాడు రోజర్ ఫెదరర్ ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.

 

అయితే తాజాగా ఆ జాబితాలో సచిన్ వచ్చి చేరాడు. తన స్నేహితుడు నటించిన 'పీకే' విడుదల కోసం తాను ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు సచిన్ స్పష్టం చేశాడు. ఇందుకోసం అమిర్ ఖాన్ తగిన ఏర్పాట్లు చేయడానికి సిద్ధమయ్యాడు. ప్రస్తుతం సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో ఉన్న అమిర్.. వచ్చే వారం సచిన్ కోసం  పీకే స్పెషల్ షోను ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement