breaking news
PK movie unit
-
సచిన్ కోసం 'పీకే' స్పెషల్ షో!
న్యూఢిల్లీ: అమిర్ ఖాన్ హీరోగా నటించిన 'పీకే' సినిమా విడుదల కోసం వేచి చూసే ప్రముఖ వ్యక్తుల్లో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కూడా జాయిన్ అయ్యాడు. రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కోసం సినీ అభిమానులతో పాటు, పలువురు క్రీడాకారులు కూడా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పీకే సినిమా విడుదల కోసం టెన్నిస్ స్టార్ ఆటగాడు రోజర్ ఫెదరర్ ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆ జాబితాలో సచిన్ వచ్చి చేరాడు. తన స్నేహితుడు నటించిన 'పీకే' విడుదల కోసం తాను ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు సచిన్ స్పష్టం చేశాడు. ఇందుకోసం అమిర్ ఖాన్ తగిన ఏర్పాట్లు చేయడానికి సిద్ధమయ్యాడు. ప్రస్తుతం సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో ఉన్న అమిర్.. వచ్చే వారం సచిన్ కోసం పీకే స్పెషల్ షోను ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపాడు. -
పీకే సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నా!
ముంబై: త్వరలో విడుదల కానున్న అమిర్ ఖాన్ 'పీకే' చిత్రం పట్ల టెన్నిస్ స్టార్ రోజరర్ ఫెదరర్ కూడా ఆకర్షితుడయ్యాడు. అమిర్ ఖాన్, అనుష్క శర్మల కాంబినేషన్లో రానున్న 'పీకే' సినిమాను వీక్షించడానికి ఎదరుచూస్తున్నట్లు ఫెదరర్ స్పష్టం చేశాడు. ఆ సినిమాకు సంబంధించి అమిర్ విడుదల చేసిన తొలి పోస్టర్ తనలో ఆసక్తిని మరింత ఇందుకు కారణమన్నాడు. అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్) లో భాగంగా అమిర్ తో కలిసి ఫ్రెండ్లీ మ్యాచ్ లో ఆడిన ఫెదరర్ తన మనసులో విషయాన్ని బయటపెట్టాడు. 'నేను పీకే సినిమాను వీక్షించడానికి ఆతృతగా ఎదురుచూస్తున్నాను. ఆ చిత్ర తొలి పోస్టర్ నాలో ఆసక్తిని పెంచింది. ఈ సినిమాను అమిర్ కలిసి చూడాలని ఉంది' అని ఫెదరర్ స్పష్టం చేశాడు. ఈనెల 19వ తేదీన విడుదల కానున్న ఈ చిత్రంలో అమిర్ విభిన్న పాత్రలో కనిపించనున్నాడు. -
హైదరాబాద్‌లో 'పీకే' ప్రమోషన్ దృశ్యాలు
-
హైదరాబాద్‌లో 'పీకే' టీమ్ సందడి
హైదరాబాద్: త్వరలో విడుదలకానున్న బాలీవుడ్ చిత్రం 'పీకే' నటబృందం మంగళవారం హైదరాబాద్‌లో సందడి చేసింది. సినిమా ప్రమోషన్లో భాగంగా ఇందులో నటించిన హీరో అమీర్ ఖాన్, హీరోయిన్ అనుష్క శర్మ, దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ తదితరులు నగరానికి వచ్చారు. ఈ కార్యక్రమంలో అమీర్, అనుష్క, రాజ్‌కుమార్ మాట్లాడారు. 'పీకే' సినిమా ఈ నెల 19న విడుదల కానుంది. ఇందులో అమీర్ ఖాన్ విభిన్న పాత్ర పోషించినట్టు దర్శకుడు రాజకుమార్ చెప్పారు. ఈ చిత్రంలో అమీర్ వాడిన ట్రాన్సిస్టర్‌ను వేలం వేయనున్నట్టు చిత్ర వర్గాలు తెలిపాయి. మరిన్ని చిత్రాలకు క్లిక్ చేయండి