బాలయ్య సినిమాలో ఛాన్స్ కొట్టేసింది..!

Regina to romance Nandamuri Balakrishna in 102nd film

యమా స్పీడుగా సినిమాలు చేస్తున్న నందమూరి బాలకృష్ణ, ప్రస్తుతం తన 102వ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. తమిళ స్టార్ డైరెక్టర్ కేయస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు జయసింహా, కర్ణ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది. మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది.

మరో గ్లామరస్ రోల్ తో నటాషా దోషి తెలుగు తెరకు పరిచయం అవుతోంది. తాజాగా బాలయ్యకు జోడిగా మరో హీరోయిన్ ను ఫైనల్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. తెలుగులో స్టార్ ఇమేజ్ కోసం ఎదురుచూస్తున్న రెజీనా బాలయ్య సినిమాలో మరో హీరోయిన్ గా నటిస్తోందట. ప్రస్తుతానికి చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించకపోయినా.. బాలయ్య 102వ సినిమాలో రెజీనా కనిపించటం ఖాయంగా కనిపిస్తోంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top