భవిష్యత్‌ గురించి నో ఫికర్‌..!

Regina Cassandra About Her Future Plans In Movies - Sakshi

భవిష్యత్‌ గురించి ఎలాంటి బాధ లేదంటోంది నటి రెజీనా. ఆరణాల చెన్నై బ్యూటీ అయిన ఈ అమ్మడు తమిళంతో పాటు తెలుగు, హిందీ అంటూ పలు భాషల్లో నటిస్తూ బహుభాషా నటిగా పేరు తెచ్చుకుంది. అయితే ఏ భాషలోనూ స్టార్‌ హీరోలతో నటించే అవకాశాలను రాబట్టుకోలేకపోయింది. ఇదే ప్రశ్నను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో  రెజీనా ముందుంచితే ఇలాంటి వాటి గురించి కారణాలేమిటో తనకూ తెలియలేదని బదులిచ్చింది. తాను నటించిన చిత్రాలన్నీ హిట్టేనని చెప్పింది. ఆ మధ్య తెలుగులో నటించిన  ‘అ!’ చిత్రాన్ని జాతీయ అవార్డు వరించింది. దానికి మేకప్పే ముఖ్య అంశం అని, అందుకు తానూ ఒక కారణం అని చాలా మంది ప్రశంసించినట్లు తెలిపింది. ఆ చిత్రంలోని పాత్రకు మేకప్‌ కోసం తాను గంటల తరబడి సమయాన్ని కేటాయించినట్లు రెజీనా చెప్పింది.

ఇంకో విషయం ఏమిటంటే కథల గురించి తానెప్పుడూ ఆలోచించనంది. అందులో తన పాత్రనే ముఖ్యంగా భావిస్తానని చెప్పింది.  ఈ పాత్ర తనకు భవిష్యత్‌లో సహాయపడుతుందా అన్న దాని గురించి ఆలోచించనని చెప్పింది.  ఇచ్చిన పాత్రలకు పూర్తిగా న్యాయం చేయడానికి శ్రమిస్తానని అంది. భవిష్యత్‌ గురించి చింతించనని రెజీనా పేర్కొంది. కాగా ప్రస్తుతం ఈ అమ్మడు కోలీవుడ్‌లో ‘కల్లపాట్’, ‘కసడ తపద’ చిత్రాల్లో నటిస్తోంది. రెజీనా నటించిన నిర్మాణం పూర్తి చేసుకున్న ‘నెంజం మరప్పదిలై’, ‘పార్టీ’ చిత్రాలు విడుదల కావలసి ఉన్నాయి. ఇక తెలుగులో నటించిన ‘ఎవరు’ చిత్రం గురువారం తెరపైకి రానుంది. ఈ చిత్రంపైనా రెజీనా చాలా నమ్మకం పెట్టుకుంది.
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top