‘డిస్కోరాజా’ షూటింగ్‌ ప్రారంభం

Ravi Teja Disco Raja Movie Shooting Started On 4th March - Sakshi

ఈ మధ్య మాస్‌ మహారాజా రవితేజ టైమ్‌ అస్సలు బాగోలేనట్టుంది. ఏ సినిమా చేసినా దారుణమైన ఫలితాన్ని మూటగట్టుకుంటోంది. రీసెంట్‌గా వచ్చిన ‘అమర్‌అక్బర్‌ఆంటోని’ కూడా తీవ్ర నిరాశను మిగల్చగా.. ప్రస్తుతం ఓ డిఫరెంట్‌ స్టోరీతో రాబోతోన్న ‘డిస్కోరాజా’ షూటింగ్‌ నేడు ప్రారంభమైంది.

ఈ మూవీని ప్రకటించి కూడా చాలా రోజులు అవుతున్నా.. చిత్రబృందం మాత్రం నేడు షూటింగ్‌ను లాంచనంగా ప్రారంభించింది. ఆ మధ్య సినిమా ఆగిపోయిందని, రెమ్యునరేషన్‌ విషయమై గొడవలు వచ్చాయని, స్క్రిప్ట్‌ సరిగా లేదని సినిమా ఆగిపోనుందనే వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ రూమర్సే అని నేడు తేలిపోయింది. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్కక్షణం’ ఫేమ్‌ వీఐ ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో.. పాయల్‌ రాజ్‌పుత్‌, నభా నటేష్‌లు హీరోయిన్‌లు నటిస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

సంబంధిత వార్తలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top