ఔను.. ప్రేమలో పడ్డాను | Ranveer Singh opens up about his relationship with Deepika | Sakshi
Sakshi News home page

ఔను.. ప్రేమలో పడ్డాను

Dec 30 2015 6:27 PM | Updated on Apr 3 2019 6:23 PM

ఔను.. ప్రేమలో పడ్డాను - Sakshi

ఔను.. ప్రేమలో పడ్డాను

బాలీవుడ్ జంట రణ్వీర్ సింగ్, దీపిక పదుకొన్ పీకల్లోతు ప్రేమలో ముగినితేలుతున్నట్టు కొంతకాలంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

బాలీవుడ్ జంట రణ్వీర్ సింగ్, దీపిక పదుకొన్ పీకల్లోతు ప్రేమలో ముగినితేలుతున్నట్టు కొంతకాలంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తరచూ సినిమా ఫంక్షన్లు, పార్టీల్లో ఈ జంట చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ కనిపిస్తుంటారు. రణ్వీర్, దీపిక అనుబంధం బాలీవుడ్లో హాట్ టాపిక్. అయితే తమ అనుబంధం గురించి ఈ జంట ఇప్పటి వరకు ఔనని కానీ కాదని కానీ చెప్పలేదు.

రణ్వీర్ తన అనుబంధం గురించి ఇటీవల నోరు విప్పాడు. తాను ప్రేమలోపడ్డానని, ఒకరితో అనుబంధముందని రణ్వీర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. సిన్సియర్గా ప్రేమిస్తున్నానని వెల్లడించాడు. తమ అనుబంధం బాగుందని, ఇలాంటి అనుభూతి గతంలో ఎప్పుడూ చవిచూడలేదన్నాడు. ఇంకేముంది రణ్వీర్ ప్రేయసి దీపికేనని బాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. రణ్‌వీర్‌సింగ్‌, దీపిక నటించిన బాజీరావు మస్తానీ విజయం సాధించడంతో ఈ జంట మంచి జోష్తో ఉన్నారు. కాగా గతంలో దీపిక కొందరితో ఎఫైర్ సాగించినట్టు వార్తలు వచ్చాయి. ఈ జాబితాలో మరో బాలీవుడ్ హీరో రణ్బీర్ కపూర్ పేరు కూడా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement