నేను గర్భవతిని కాదు: హీరోయిన్ | I am not pregnant, I am not engaged: Deepika Padukone | Sakshi
Sakshi News home page

నేను గర్భవతిని కాదు: హీరోయిన్

Jul 21 2016 10:37 AM | Updated on Apr 3 2019 6:34 PM

నేను గర్భవతిని కాదు: హీరోయిన్ - Sakshi

నేను గర్భవతిని కాదు: హీరోయిన్

ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం తనకు లేదని కుండబద్దలు దీపికా పదుకునే కొట్టింది.

న్యూఢిల్లీ: బాలీవుడ్ ప్రేమజంట రణవీర్ సింగ్, దీపికా పదుకునే త్వరలో పెళ్లి చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది. వీరిద్దరి పెళ్లి పెద్దలు ఒప్పుకున్నారని, పెళ్లిబాజాలు మోగమే తరువాయి అని కూడా వార్తలు వచ్చాయి. తమ పెళ్లిపై వస్తున్న ఊహాగానాలకు 'మస్తానీ' తెరదించింది. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం తనకు లేదని కుండబద్దలు కొట్టింది. ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా రూపొందించిన వస్త్రాలతో బుధవారం రాత్రి నిర్వహించిన ఫ్యాషన్ షోలో ఆమె పాల్గొంది.

ఈ సందర్బంగా రణవీర్ తో పెళ్లి గురించి అడగ్గా... 'దీనిపై స్పష్టత ఇవడానికి ఇదే సరైన సమయం. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. నేను గర్భవతిని కాదు. నాకు పెళ్లి కాలేదు. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కే ఉద్దేశం లేద'ని దీపిక పేర్కొంది. తమ పెళ్లి వార్తలపై రణవీర్ సింగ్ కూడా ఇదేవిధంగా స్పందించాడు. దీంతో ఈ ప్రేమపక్షులు ఇప్పట్లో పెళ్లి చేసుకోరని అర్థమైపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement