చైనాలో ‘రాణీ’స్తోన్న హిచ్కీ

Rani Mukerji Hichki Earns Rs 100 Crore In China - Sakshi

కెరియర్‌ తొలి నాళ్లలో గ్లామర్‌ పాత్రలకే పరిమితమైన హీరోయిన్లు సెకండ్‌ ఇన్నింగ్స్‌లో మాత్రం తమ పాత్రకు ప్రాధాన్యమున్న చిత్రాల్లోనే నటిస్తున్నారు. ఈ కోవలోకే వస్తారు నటి రాణీ ముఖర్జీ.  ఈ ఏడాది మార్చిలో ‘హిచ్కీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు రాణి. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు మంచి వసూళ్లు రాబట్టింది. ఇండియాలో ఈ చిత్రం రూ. 76 కోట్లకు పైగా వసూళ్లను సాధించి.. ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాల సరసన నిలిచింది.

ఈ చిత్రం ఇప్పుడు మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. చైనాలో ఈ నెల 12న విడుదలయిన ఈ చిత్రం సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతూ 100 కోట్ల మార్క్‌ను దాటేసినట్లు రాణి ముఖర్జీ తెలిపారు. కంటెంట్‌ ఉన్న సినిమాకు భాషతో, ప్రాంతంతో సంబంధం లేదని ‘హిచ్కీ’ మరోసారి నిరూపించిందని ఆమె పేర్కొన్నారు. సిద్థార్థ్‌ మల్హోత్రా దర్వకత్వం వహించిన ఈ చిత్రంలో రాణి టీచర్‌ కావాలనే బలమైన లక్ష్యం...కానీ నోరు తెరచి ఏ మాట్లాడినా వింత శబ్దాలు చేసే జబ్బు...అన్ని అడ్డంకులు దాటుకొని లక్ష్యం చేరుకునే మహిళ నైనా మాథుర్‌ పాత్రలో ఆకట్టుకున్నారు.

గతంలో ఆమిర్‌ ఖాన్‌ ‘ధూమ్‌3’, ‘దంగల్‌’, ‘పీకే’, ‘సీక్రెట్‌ సూపర్‌ స్టార్స్‌’, సల్మాన్‌ ఖాన్‌ ‘బజరంగి భాయిజాన్‌’ చిత్రాలు చైనా బాక్స్‌ ఆఫీస్‌ వద్ద విజయాన్ని సాధించాయి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top