పిండి కొద్దీ రొట్టె

Ranbir Kapoor opens up about gender pay parity in Bollywood - Sakshi

ఇండస్ట్రీలో మేల్‌ యాక్టర్స్‌తో పోలిస్తే మాకు తగినంత పారితోషికం ఇవ్వట్లేదంటూ ఇటీవల బాలీవుడ్‌లో పలువురు భామలు వాపోయారు. సినిమాలో కీలక పాత్రలు ఉన్నప్పటికీ పారితోషికంలో వ్యత్యాసం ఉంటుందని పేర్కొన్నారు. పారితోషికాల విషయంలో స్త్రీ, పురుషులు అనే వ్యత్యాసం ఉందా? అని రణ్‌బీర్‌ కపూర్‌ని అడగ్గా –‘‘పిండి కొద్దీ రొట్టె.

జెండర్‌ని బట్టి పారితోషికం నిర్ణయిస్తారనుకోవటం పొరపాటు. ఎవరి మార్కెట్‌ ఎంతో అందరికీ ఒక అవగాహన ఉంటుంది. దాన్ని బట్టి పే ఉంటుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే.. సినిమాలు బాగా ఆడితేనే ఇస్తారు. లేదంటే లేదు. ఒకవేళ నెక్ట్స్‌ నేను దీపికా పదుకోన్‌తో యాక్ట్‌ చేస్తే తనకి, నాకు సమానంగా ఇవ్వొచ్చు లేదా తనకే ఇంకా ఎక్కువ ఇవ్వొచు’’ అని చెప్పుకొచ్చారు రణ్‌బీర్‌.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top