‘ఏడాదిలో నేర్చుకునేది ఒక్క గంటలో నేర్చుకోవచ్చు’

Rana Tweet About Kamal Hassan On Their Meeting Occasion - Sakshi

లోక నాయకుడు, యూనివర్సల్‌ హీరో కమల్ హాసన్‌ ప్రస్తుతం ‘విశ్వరూపం2’ ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌ చేరుకున్నారు. నేడు జరుగనున్న ఆడియో వేడుకలో పాల్గొనేందుకు నగరానికి విచ్చేశారు. కమల్‌ స్వీయ దర్శకత్వంలో వస్తోన్న విశ్వరూపం2 సినిమాను తెలుగులో కూడా భారీగా రిలీజ్‌ చేసేందుకు రెడీ అయ్యారు కమల్‌ హాసన్‌.

దగ్గుబాటి రానా కమల్‌హాసన్‌తో దిగిన ఫోటోను షేర్‌ చేస్తూ.. ఏడాదిలో నేర్చుకునేది ఒక్కగంటలోనే నేర్చుకున్నారంటే.. మీరు ఒక గొప్ప వ్యక్తిని కలుసుకున్నట్లేనంటూ.. కమల్‌నుద్దేశించి రానా ట్వీట్‌ చేశాడు. కమల్‌ హాసన్‌ నటించి, దర్శకత్వం వహించిన విశ్వరూపం2 ఆగస్టు 10న విడుదల కానుంది. ఈ సినిమాకు జిబ్రాన్‌ సంగీతమందిచారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top