ర్యాపిడ్ ఫైర్లో రానా ఆన్సర్స్ | Sakshi
Sakshi News home page

ర్యాపిడ్ ఫైర్లో రానా ఆన్సర్స్

Published Sat, Jul 8 2017 12:44 PM

ర్యాపిడ్ ఫైర్లో రానా ఆన్సర్స్ - Sakshi

సౌత్ సినీ పండుగ సైమా అబుదాబిలో ఘనంగా జరిగింది. దక్షిణాది సినీ ప్రముఖులు హాజరైన ఈ వేదికపై యంగ్ హీరో రానా ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా యాంకర్ అడిగిన ర్యాపిడ్ ఫైర్ ప్రశ్నలకు రానా చెప్పిన సమాధానాలు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారాయి. తన బ్రెస్ట్ ఫ్రెండ్, తనకు నచ్చిన చోటు, ఇష్టమైన ఫుడ్ లాంటి విషయాలను ఏ మాత్రం తడబడకుండా టక టక చెప్పేశాడు రానా.

ఒకే పాటను జీవితాంతం వినాల్సి వస్తే బాహుబలి సినిమాలోని మహిష్మతి టైటిల్ సాంగ్నే వింటాడట. ఎప్పటికీ ఒకే నగరంలో ఉండాల్సి వస్తే హైదరాబాద్, ఒకే ఫుడ్ తినాల్సి వస్తే హాలీమ్, ఒకే సినిమా రోజూ చూడాల్సి వస్తే స్టార్ వార్స్ సినిమాలు చూస్తాడట. ఒకే షో ఎప్పటికీ చూడాల్సి వస్తే మాత్రం టీవీ ఆఫ్ చేసేస్తానన్నాడు రానా. ఒకే మనిషి జీవితాంతం ఫ్రెండ్గా ఉండాల్సి వస్తే ఆ ప్లేస్ రామ్ చరణ్కు మాత్రమే ఇస్తా అన్నాడు.

జీవితాంతం తనకు ఒకే ప్రేక్షకుడు ఉంటే అది మా నాన్నే అన్న రానా, ఒకే స్టార్తో జీవితాంతం గడపాల్సి వస్తే అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పలేను అన్నాడు. తాను పుట్టిన దగ్గర నుంచి స్టార్ల మధ్యే పెరిగాను కాబట్టి ఒకే స్టార్ను ఎంపిక చేసుకోవటం కష్టమన్నాడు.

Advertisement
 
Advertisement
 
Advertisement