ఒక యుద్ధం.. రెండు సినిమాలు.. ఇద్దరు హీరోలు | Rana and allu sirish in war based Films | Sakshi
Sakshi News home page

ఒక యుద్ధం.. రెండు సినిమాలు.. ఇద్దరు హీరోలు

Jan 21 2017 10:55 AM | Updated on Aug 11 2019 12:52 PM

ఒక యుద్ధం.. రెండు సినిమాలు.. ఇద్దరు హీరోలు - Sakshi

ఒక యుద్ధం.. రెండు సినిమాలు.. ఇద్దరు హీరోలు

బాలీవుడ్ తరహాలో టాలీవుడ్లో కూడా యదార్థ సంఘటనల ఆధారంగా సినిమాలను తెరకెక్కిస్తున్నారు.

బాలీవుడ్ తరహాలో టాలీవుడ్లో కూడా యదార్థ సంఘటనల ఆధారంగా సినిమాలను తెరకెక్కిస్తున్నారు. చారిత్రక కథాంశంతో తెరకెక్కిన గౌతమిపుత్ర శాతకర్ణి ఘనవిజయం సాధించటంతో ఇప్పుడు పీరియాడిక్ సినిమాల మీద దృష్టిపెడుతున్నారు. ముఖ్యంగా యంగ్ హీరోలు ఈ తరహా సినిమాలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. అందుకే ఇద్దరు యంగ్ హీరోలు ఒకేసారి ఒకే సంఘటన ఆధారంగా తెరకెక్కుతున్న రెండు సినిమాల్లో నటిస్తున్నారు.

టాలీవుడ్ హంక్ రానా, అల్లు వారబ్బాయి శిరీష్లు 1971లో భారత్, పాకిస్థాన్ల మధ్య జరిగిన యుద్ధ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమాల్లో నటిస్తున్నారు. ఘాజీ పేరుతో తెరకెక్కుతున్న మల్టీ లాంగ్వేజ్ సినిమాలో రానా హీరోగా నటిస్తుండగా.. 1971 బెయాండ్ బార్డర్స్ పేరుతో తెరకెక్కుతున్న మలయాళ సినిమాలో అల్లు శిరీష్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా నటిస్తున్నాడు.

ఘాజీ విశాఖ తీరంలో సముద్ర గర్భంలో జరిగిన యుద్ధం కాగా.. 1971 మాత్రం సరిహద్దుల్లో జరిగిన యుద్ధాన్ని తెరమీద ఆవిష్కరిస్తున్నాయి. ఘాజీ ఫిబ్రవరి 17న రిలీజ్ అవుతుండగా.. 1971 బెయాండ్ బార్డర్స్ రిలీజ్కు మాత్రం మరింత సమయం పట్టే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement