మిస్టర్‌ సి.. మాస్టర్‌ చెఫ్‌ | Ram charan Cooking for Upasana | Sakshi
Sakshi News home page

మిస్టర్‌ సి.. మాస్టర్‌ చెఫ్‌

Apr 19 2018 12:43 AM | Updated on Jul 26 2018 5:23 PM

Ram charan Cooking for Upasana - Sakshi

రామ్‌చరణ్‌

సిల్వర్‌ స్క్రీన్‌పై సందడి చేసే స్టార్స్‌ అందుకు భిన్నంగా ఇంట్లో కిచెన్‌లో గరిటె తిప్పితే అది న్యూసే. పైగా రామ్‌చరణ్‌లాంటి స్టార్‌ అంటే ఏం కుక్‌ చేశారో తెలుసుకోవాలని ఉంటుంది. అలా అలవోకగా కిచెన్‌లో నిలబడి కుక్‌ చేస్తున్న ఫొటోలు కూడా చూడాలని కూడా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారుగా.. చరణ్‌ కుక్‌ చేయడాన్ని ఎంజాయ్‌ చేస్తున్నారనిపిస్తోంది కదూ. బుధవారం ఉదయం వర్కౌట్స్‌ పూర్తయ్యాక ఇలా చెఫ్‌గా మారిపోయారు రామ్‌చరణ్‌. ‘‘మిస్టర్‌ సి (రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన ఇలానే పిలుస్తారు) మాస్టర్‌ చెఫ్‌గా మారి మా అందరి కోసం బ్రేక్‌ఫాస్ట్‌ రెడీ చేస్తున్నాడు.

అది కూడా హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌’’ అని పేర్కొన్నారు ఉపాసన. మొన్నీ మధ్య ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో డైట్‌ విషయం మొత్తం ఉపాసనదే. హెల్దీ ఫుడ్స్‌ గురించి తనకు బాగా ఐడియా ఉంది’’ అన్నారు. బహుశా శ్రీమతి చెప్పిన ఓ హెల్దీ రెసిపీతో చరణ్‌ బ్రేక్‌ఫాస్ట్‌ తయారు చేసి ఉంటారని ఊహించవచ్చు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్‌చరణ్‌ హీరోగా ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఈ 21నుంచి ఈ చిత్రం షూటింగ్‌లో  రామ్‌చరణ్‌ పాల్గొననున్నారు. మరోవైపు రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్, ఎన్టీఆర్‌ హీరోలుగా రూపొందనున్న చిత్రం  బడ్జెట్‌ 300 కోట్లని టాక్‌. అక్టోబర్‌ నుంచి ఈ షూటింగ్‌ స్టార్ట్‌ కానుంది.

అది చవకబారుతనం
‘‘అందరూ కలిసి పని చేసుకుంటూ ఎదగాల్సిన ఒక కుటుంబంలాంటిది మన ఇండస్ట్రీ. మన ఇండస్ట్రీలో మహిళలను ఎప్పుడూ అత్యంత గౌరవంతో చూస్తాం. ఏవైనా సమస్యలు ఉన్నా వాటిని న్యాయబద్ధంగా,సంస్కారవంతంగా పరిష్కరించుకోవాలి. అయితే, కొందరి పేర్లు అనవసరంగా లాగి రాద్ధాంతం చేసి పాపులర్‌ అవ్వాలని చూడటం చవకబారుతనంగా ఉంటుంది’’ అని తన ఫేస్‌బుక్‌ ఖాతాలోహీరో రామ్‌చరణ్‌ పేర్కొన్నారు. ఇండస్ట్రీలో ‘క్యాస్టింగ్‌ కౌచ్‌’పై జరుగుతున్న వివాదాలను దృష్టిలో పెట్టుకునే చరణ్‌ ఈ విధంగా స్పందించి ఉంటారని ఊహించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement