
ఆ హిట్ ఇచ్చినందుకు థ్యాంక్స్
కెరటం సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన రకుల్ప్రీత్సింగ్ ప్రస్తుతం స్టార్ స్టేటస్ను ఎంజాయ్ చేస్తోంది.
కెరటం సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన రకుల్ప్రీత్సింగ్ ప్రస్తుతం స్టార్ స్టేటస్ను ఎంజాయ్ చేస్తోంది. రామ్ చరణ్తో బ్రూస్లీ, ఎన్టీఆర్తో నాన్నకు ప్రేమతో సినిమాలతో పాటు బన్నీ - బోయపాటి శ్రీనుల కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో కూడా హీరోయిన్గా నటిస్తోంది ఈ బ్యూటీ.
తనకు ఈ స్థాయి రావడానికి హెల్ప్ అయిన సక్సెస్ఫుల్ సినిమా లౌక్యం విడుదలై ఏడాది పూర్తవుతున్న సందర్భంగా తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ తరువాత తన కెరీర్లో సెకండ్ బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ అందించిన లౌక్యం యూనిట్తో పాటు తనను నమ్మి ఆ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు దర్శకుడు శ్రీవాస్కు కృతజ్ఞతలు తెలియజేసింది.
#1yearofloukyam , 2nd turning point in my career .Very special film.Thanks to d entire team specially dir Srivasu sir for believing in me :)
— Rakul Preet (@Rakulpreet) September 26, 2015