సినిమాలో చేసినవి నిజంగా చేస్తామా? | Rakul Preet Singh trolled for smoking in Manmadhudu 2 | Sakshi
Sakshi News home page

సినిమాలో చేసినవి నిజంగా చేస్తామా?

Jul 19 2019 12:13 AM | Updated on Jul 23 2019 11:50 AM

Rakul Preet Singh trolled for smoking in Manmadhudu 2 - Sakshi

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌

‘‘సినిమాలో పాత్ర ఏ విధంగా ఉంటే అలా మేం నటిస్తాం. అంతే కానీ సినిమాలో మేం పోషించే పాత్ర ఏదైనా చెడు చేస్తే దాన్ని మేం ప్రమోట్‌ చేసినట్టు కాదు. నిజ జీవితంలో మేం వాటిని అనుసరిస్తున్నట్టూ కాదు. ఆ సన్నివేశాలను చూసి నన్ను విమర్శించేవాళ్లను పట్టించుకోను కూడా’’ అన్నారు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. తన లేటెస్ట్‌ చిత్రం ‘మన్మథుడు 2’ టీజర్‌లో రకుల్‌ పొగ తాగుతూ కనిపించారు. ఇది సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసింది. పలువురు రకుల్‌ని విమర్శించారు. ఈ విషయానికి రకుల్‌ స్పందించారు. ‘‘నిజజీవితంలో నేను పొగ తాగను.

అంతెందుకు నాకు చీట్‌ డే (వారంలో నచ్చినవన్నీ తినడానికి ప్రత్యేకంగా పెట్టుకునే రోజు) కూడా ఉండదు. నా చుట్టూ ఉండేవాళ్లకు తెలుసు.. నేను ఫిట్‌నెస్‌కి ఎంత ప్రాముఖ్యత ఇస్తానో. ‘కబీర్‌ సింగ్‌’లోనూ షాహిద్‌ సిగిరెట్‌ తాగాడు. అతను పొగతాగడాన్ని ప్రోత్సహిస్తున్నట్టా? కానే కాదు. సినిమాలో స్మోక్‌ చేసినంత మాత్రాన అవి మా నిజజీవితంలో చేస్తామని కాదు. సినిమాకు, నిజజీవితానికి తేడాను అర్థం చేసుకోవాలి. విమర్శలకు రియాక్ట్‌ అయితే ప్రతీది పట్టించుకోవాలి. నాకంత ఆసక్తి లేదు. నా తల్లిదండ్రులు నన్ను అర్థం చేసుకోవడం ముఖ్యం’’ అన్నారు రకుల్‌. నాగార్జున, రకుల్‌ జంటగా నటించిన ‘మన్మథుడు 2’ ఆగస్ట్‌ 9న రిలీజ్‌ కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement