నాకు మూడు ‘ఎఫ్’లంటే ఇష్టం! | Rakul Preet Singh interview | Sakshi
Sakshi News home page

నాకు మూడు ‘ఎఫ్’లంటే ఇష్టం!

Jan 16 2016 10:29 PM | Updated on Sep 3 2017 3:45 PM

నాకు మూడు ‘ఎఫ్’లంటే ఇష్టం!

నాకు మూడు ‘ఎఫ్’లంటే ఇష్టం!

తెలుగులో ‘మోస్ట్ వాంటెడ్’ హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్. వరుసగా టాప్ స్టార్స్‌తో సినిమాలు చేస్తూ, బిజీగా ఉన్నారు.

తెలుగులో ‘మోస్ట్ వాంటెడ్’ హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్. వరుసగా టాప్ స్టార్స్‌తో సినిమాలు చేస్తూ, బిజీగా ఉన్నారు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘నాన్నకు ప్రేమతో’లో ఎన్టీఆర్ సరసన రకుల్ నటించిన విషయం తెలిసిందే. సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రంలో రకుల్ ఫస్ట్ టైమ్ తెలుగులో డబ్బింగ్ చెప్పారు. ఆ హ్యాపీనెస్‌ని మీడియాతో పంచుకున్నారు.
 
ఎన్టీఆర్ చాలా అద్భుతమైన నటుడు. ఇలాంటి సినిమాలో అవకాశం దక్కడం నా అదృష్టం. లండన్‌లో ఈ చిత్రం షూటింగ్ చేస్తున్నప్పుడు ‘తెలుగు బాగానే మాట్లాడుతున్నావు కదా.. డబ్బింగ్ చెబుతావా’ అని సుకుమార్ అడిగారు. ఏదో అలా అంటున్నారులే అనుకుని, ‘సరే’ అన్నాను. ఇండియా వచ్చాక వాయిస్ టెస్ట్‌కి పిలిపించి, నిజంగానే డబ్బింగ్ చెప్పించేశారు. చాలా హ్యాపీ అనిపించింది. అందరూ నా డబ్బింగ్ బాగుందంటున్నారు.
 
హిందీలో ‘సిమ్లా మిర్చి’ పూర్తయ్యింది. అది ఏప్రిల్‌లో విడుదలవుతుంది. తమిళ్ నుంచి కూడా చాలా అవకాశాలు వస్తున్నాయి. నేను ఏ భాషలో సినిమా చేసినా తెలుగమ్మాయినే. అంతలా తెలుగుకి కనెక్ట్ అయిపోయాను.
 
  తాను రొమాన్స్‌లో వీక్ అని ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో అన్నారు. మరి.. మీ సంగతి ఏంటని అనడిగితే, ‘‘నేను కూడా వీక్. బాధ, కోపం, నవ్వు, రొమాన్స్... ఏదైనా సరే డెరైక్టర్ చెప్పినట్లు చేసేస్తాను. అంతే తప్ప ఎమోషనల్ సీన్‌లో నటించాలనప్పుడే ఏదైనా బాధాకరమైన సంఘటన గుర్తు తెచ్చుకోవడమో, రొమాంటిక్ సీన్ చేసేటప్పుడు అలాంటి సీన్ గుర్తు చేసుకోవడమో చేయను.
 
నాకు మూడు ‘ఎఫ్’లంటే ఇష్టం. ఫుడ్, ఫిలిం, ఫిట్‌నెస్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement