బిగ్‌ బ్యానర్‌లో సెకండ్‌ ఛాన్స్‌ | Rahul Ravindran Second Directorial In Annapurna Studios Banner | Sakshi
Sakshi News home page

Jul 7 2018 12:03 PM | Updated on Jul 7 2018 3:15 PM

Rahul Ravindran Second Directorial In Annapurna Studios Banner - Sakshi

అందాల రాక్షసి సినిమాతో హీరోగా పరిచయం అయిన యువ నటుడు రాహుల్ రవీంద్రన్‌. తొలి సినిమాతోనే హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ తరువాత ఆ ఫాంను కొనసాగించలేకపోయాడు. ఒకటి రెండు సినిమాల్లో సపోర్టింగ్‌ రోల్స్‌లో కనిపించిన ఈ యంగ్ హీరో ప్రస్తుతం దర్శకుడిగా తన తొలి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్‌ హీరోగా తెరకెక్కుతున్న చిలసౌ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు రాహుల్. ఈ సినిమా సెట్స్‌మీద ఉండగానే మరో సినిమాకు ఓకె చెప్పాడు. అన్నపూర్ణ స్టూడియోస్‌ లాంటి ప్రస్టీజియస్‌ బ్యానర్‌లో దర్శకుడిగా తన రెండో సినిమా తెరకెక్కనుందట వెల్లడించారు రాహుల్‌. నటీనటులు సాంకేతిక నిపుణులను ఫైనల్‌ చేయాల్సి ఉందని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement