
రజనీతో రాధికా ఆప్టే ...కన్‌ఫర్మ్!
సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా సినిమాలో కథానాయిక ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం లభించింది.
సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా సినిమాలో కథానాయిక ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం లభించింది. ముందుగా బాలీవుడ్ కథానాయికలు దీపికా పదుకొనే, కత్రినా కైఫ్, విద్యాబాలన్‌లు చేసే అవకాశం ఉందని వార్తలు వినిపించాయి. ఆ తర్వాత రాధికా ఆప్టే పేరు కూడా వార్తల్లోకి వచ్చింది. అలాంటిదేమీ లేదని ఆమె వివరణ కూడా ఇచ్చారు. కానీ, తీరా ఇప్పుడు రాధికా ఆప్టే పేరే కన్‌ఫర్మ్ అయింది.
‘అట్టకత్తి’, ‘మద్రాస్’ చిత్రాలను తెరకెక్కించిన రంజిత్ ఈ చిత్రానికి దర్శకుడు. సూపర్ స్టార్ రజనీకాంత్ ఇందులో గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నారు. ఈ నేపథ్యంలోనే గ్యాంగ్‌స్టర్ పక్కన ఆడిపాడే చిన్నది రాధికా ఆప్టే అని చిత్రబృందం నుంచి అధికారికంగా కబురు వచ్చింది. రజనీ కాంత్ లాంటి స్టార్ సరసన న టించే అవకాశం రావడంతో రాధిక ఆనందానికి అవధుల్లేవు. ‘‘ఈ ఎగ్జయిట్‌మెంట్‌ను కంట్రోల్ చేసుకోవాలంటే కొంత సమయం కావాల్సిందే. నా దృష్టిలో ఆయన కన్నా పెద్ద స్టార్ ఎవరూ ఉండరు. రంజిత్ చెప్పిన కథ నచ్చింది.
కథతో పాటు నా పాత్ర చిత్రణ కూడా కీలకం. అంతా బాగానే ఉంది గానీ తమిళం నేర్చుకోవడం, మాట్లాడటం నాకు పెద్ద సవాల్. కేవలం డాన్స్‌లు, పాటలకే పరిమితం కాకుండా దర్శకుడు విభిన్నంగా తీర్చిదిద్దుతారని భావిస్తున్నా’’ అని రాధికా ఆప్టే చెప్పుకొచ్చారు. ‘కాళీ’ అనే టైటిల్‌తో రూపొందనున్న ఈ చిత్ర ప్రారంభోత్సవం ఈ నెల 21న చెన్నైలో జరగనుంది.