అన్ని హర్రర్‌ సినిమాల కన్నా భిన్నంగా.. | Producer Raj Kandukuri Release Chitram First Look | Sakshi
Sakshi News home page

చిత్రం X: ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ చేసిన రాజ్‌ కందుకూరి

Mar 17 2020 1:25 PM | Updated on Mar 17 2020 1:42 PM

Producer Raj Kandukuri Release Chitram First Look - Sakshi

రాజ్‌బాల, మానస హీరోహీరోయిన్లుగా రమేష్‌ వీభూది దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘చిత్రం x’. శ్రీ శ్రీ శ్రీ చౌడేశ్వరి దేవి మూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో, బేబీ రాజశ్రీ సమర్పణలో పొలం గోవిందయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మంగళవారం నిర్మాత రాజ్‌ కందుకూరి ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు. కొత్త దర్శకులైనా, మంచి కంటెంట్‌తో సినిమాలు చేస్తే ప్రేక్షకులు తప్పకుండా విజయాన్ని అందిస్తారని పేర్కొన్నారు. ఈ చిత్రం మంచి కంటెంట్‌తో తెరకెక్కినట్లు తెలుస్తోందన్నారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నానని తెలిపారు. (ప్రభాస్‌ షూటింగ్‌ ఆగేది లేదు)

నిర్మాత పొలం గోవిందయ్య మాట్లాడుతూ.. ‘‘మా చిత్ర ఫస్ట్ లుక్ విడుదల చేసిన రాజ్ కందుకూరిగారికి ధన్యవాదాలు. డైరెక్టర్ చెప్పిన కథ ఎంతగానో నచ్చింది. ఖచ్చితంగా మంచి విజయం సాధింస్తుందనే నమ్మకంతో ఈ చిత్రాన్ని నిర్మించాను. సినిమా చాలా బాగా వచ్చింది. ఇంత మంచి సినిమా నిర్మించినందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు. దర్శకుడు రమేష్ వీభూది మాట్లాడుతూ... ‘‘ఇప్పటి వరకు ప్రేక్షకులు అన్ని భాషల్లో వచ్చిన ఎన్నో హర్రర్‌ ఫిలిమ్స్ చూసి ఉంటారు. మా సినిమా వాటన్నింటికీ భిన్నంగా ఉంటుంది. నటీనటులందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. ప్రవీణ్ సినిమాటోగ్రఫీ సినిమాకి ప్రధాన ఆకర్షణ. అవసరమైనచోట గ్రాఫిక్స్ కూడా వాడాము. సపోర్ట్ చేసిన అందరికీ ధన్యవాదాలు’’ తెలిపారు. (భారీ గ్రాఫిక్స్‌తో వస్తున్న ‘అంగుళీక’)

హీరో రాజ్ బాల మాట్లాడుతూ... ‘‘ఈ సినిమాలో నాకు హీరోగా చేసే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. భయంకరమైన అడవిలో నెల రోజుల పాటు ఈ సినిమా కోసం పని చేశాము. చిత్రీకరణ పూర్తయింది. నటీనటులందరం ఒకరితో ఒకరు పోటీ పడి మరీ నటించాము. సినిమా సూపర్‌గా వచ్చింది. పాటలు, ఫైట్స్ అదిరిపోతాయి’’ అన్నారు. ఈ చిత్రంలో పలాస శ్రీను, బాచి, సునీల్ రావినూతల, శ్యాం పిల్లలమర్రి తదితరులు నటిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: ప్రవీణ్ కె కావలి, మ్యూజిక్: శివ ప్రణయ్, డాన్స్: కపిల్ మాస్టర్, ఫైట్స్: అంజి మాస్టర్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement