breaking news
Rajbala
-
మంచి చిత్రాలను ఆదరించాలి
‘‘చిత్రం ఎక్స్’ సినిమా ట్రైలర్ చాలా బాగుంది. ఇటువంటి మంచి చిత్రాలను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నా. హీరో రాజ్‌బాల, యూనిట్‌కి ఆల్ ద బెస్ట్’’ అన్నారు శ్రీకాంత్. రాజ్‌బాల, మానస జంటగా రమేష్ వీభూది దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘చిత్రం ఎక్స్’. శ్రీశ్రీశ్రీ చౌడేశ్వరి దేవీ మూవీ క్రియేషన్స్ పతాకంపై పొలం గోవిందయ్య నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్‌ను శ్రీకాంత్ విడుదల చేశారు. రమేష్ వీభూది మాట్లాడుతూ– ‘‘14 సంవత్సరాలు దర్శకత్వ శాఖలో చేశాను. తేజాగారివద్ద సహాయ దర్శకుడిగా చేశా. మా సినిమా అవుట్‌పుట్ బాగా వచ్చింది. పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను’’ అన్నారు. ‘‘కరోనా కష్టకాలంలో పెద్ద మనసుతో శ్రీకాంత్‌గారు మా ట్రైలర్‌ని విడుదల చేసి, మమ్మల్ని ఆశీర్వదించడం హ్యాపీ. మా సినిమా అవుట్‌పుట్ చూసిన తర్వాత చాలా సంతోషంగా ఉన్నాను ’’ అన్నారు పొలం గోవిందయ్య. ‘‘40 రోజులు భయంకరమైన అడవిలో మేం పడ్డ కష్టాన్ని శ్రీకాంత్‌గారి అభినందనలతో మరిచిపోయాం’’ అన్నారు రాజ్‌బాల. ఈ చిత్రానికి సంగీతం: శివప్రణయ్, కెమెరా: ప్రవీణ్. కె. కావలి. -
అన్ని హర్రర్ సినిమాల కన్నా భిన్నంగా..
రాజ్‌బాల, మానస హీరోహీరోయిన్లుగా రమేష్ వీభూది దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘చిత్రం x’. శ్రీ శ్రీ శ్రీ చౌడేశ్వరి దేవి మూవీ క్రియేషన్స్ బ్యానర్లో, బేబీ రాజశ్రీ సమర్పణలో పొలం గోవిందయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మంగళవారం నిర్మాత రాజ్ కందుకూరి ఈ సినిమా ఫస్ట్‌లుక్ రిలీజ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు. కొత్త దర్శకులైనా, మంచి కంటెంట్‌తో సినిమాలు చేస్తే ప్రేక్షకులు తప్పకుండా విజయాన్ని అందిస్తారని పేర్కొన్నారు. ఈ చిత్రం మంచి కంటెంట్‌తో తెరకెక్కినట్లు తెలుస్తోందన్నారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నానని తెలిపారు. (ప్రభాస్ షూటింగ్ ఆగేది లేదు) నిర్మాత పొలం గోవిందయ్య మాట్లాడుతూ.. ‘‘మా చిత్ర ఫస్ట్ లుక్ విడుదల చేసిన రాజ్ కందుకూరిగారికి ధన్యవాదాలు. డైరెక్టర్ చెప్పిన కథ ఎంతగానో నచ్చింది. ఖచ్చితంగా మంచి విజయం సాధింస్తుందనే నమ్మకంతో ఈ చిత్రాన్ని నిర్మించాను. సినిమా చాలా బాగా వచ్చింది. ఇంత మంచి సినిమా నిర్మించినందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు. దర్శకుడు రమేష్ వీభూది మాట్లాడుతూ... ‘‘ఇప్పటి వరకు ప్రేక్షకులు అన్ని భాషల్లో వచ్చిన ఎన్నో హర్రర్ ఫిలిమ్స్ చూసి ఉంటారు. మా సినిమా వాటన్నింటికీ భిన్నంగా ఉంటుంది. నటీనటులందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. ప్రవీణ్ సినిమాటోగ్రఫీ సినిమాకి ప్రధాన ఆకర్షణ. అవసరమైనచోట గ్రాఫిక్స్ కూడా వాడాము. సపోర్ట్ చేసిన అందరికీ ధన్యవాదాలు’’ తెలిపారు. (భారీ గ్రాఫిక్స్‌తో వస్తున్న ‘అంగుళీక’) హీరో రాజ్ బాల మాట్లాడుతూ... ‘‘ఈ సినిమాలో నాకు హీరోగా చేసే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. భయంకరమైన అడవిలో నెల రోజుల పాటు ఈ సినిమా కోసం పని చేశాము. చిత్రీకరణ పూర్తయింది. నటీనటులందరం ఒకరితో ఒకరు పోటీ పడి మరీ నటించాము. సినిమా సూపర్‌గా వచ్చింది. పాటలు, ఫైట్స్ అదిరిపోతాయి’’ అన్నారు. ఈ చిత్రంలో పలాస శ్రీను, బాచి, సునీల్ రావినూతల, శ్యాం పిల్లలమర్రి తదితరులు నటిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: ప్రవీణ్ కె కావలి, మ్యూజిక్: శివ ప్రణయ్, డాన్స్: కపిల్ మాస్టర్, ఫైట్స్: అంజి మాస్టర్. -
కాలనీ ప్రేమకథ
దిలీప్, శ్రావణి, రాజ్‌బాల, అపర్ణ, బేబీ అక్షర ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘తొంగి తొంగి చూడమాకు చందమామ’. ఆనంద్ కానుమోలు దర్శకత్వంలో ఏఎం రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం తొలి షెడ్యూల్ పూర్తయింది. ‘‘ఒక కాలనీలో జరిగే ప్రేమ కథ ఇది. ప్రేమకథా చిత్రాల్లో ఓ వినూత్న ప్రయత్నం అవుతుంది. తమ మధ్య ఉన్నది ఎలాంటి బంధమో తెలియని జంట చివరి వరకు ఒకరికి ఒకరు ఆ బంధాన్ని వ్యక్తీకరించుకోరు. క్లైమాక్స్‌లో ప్రేమను వ్యక్తపరచుకోవడం అనేది ఆసక్తికరం. త్వరలో రెండో షెడ్యూల్ ప్రారంభిస్తాం. డిసెంబర్లో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు దర్శకుడు. ఈ చిత్రానికి సమర్పణ: గురు రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్.