ఈ విజయం ఆ ఇద్దరిదే | Prati Roju Pandage turns highest grosser in Tejs career | Sakshi
Sakshi News home page

ఈ విజయం ఆ ఇద్దరిదే

Published Sat, Dec 28 2019 12:14 AM | Last Updated on Sat, Dec 28 2019 12:14 AM

Prati Roju Pandage turns highest grosser in Tejs career - Sakshi

‘‘ప్రతిరోజూ పండగే’ సినిమా విజయం మారుతి, సాయి తేజ్‌లదే. ఈ ఇద్దరూ ఈ చిత్రం కోసం చాలా కష్టపడ్డారు. ఈ సినిమా చూసిన ప్రేక్షకులందరూ సంతోషంగా ఉన్నారు. మంచి సినిమా తీసిన యూనిట్‌ని అభినందిస్తున్నాను’’ అని నిర్మాత అల్లు అరవింద్‌ అన్నారు. సాయితేజ్, రాశీఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. అల్లు అరవింద్‌ సమర్పణలో ‘బన్నీ’ వాస్‌ నిర్మించిన ఈ సినిమా విజయోత్సవం రాజమండ్రిలో నిర్వహించారు. ఈ సందర్భంగా సాయి తేజ్‌ మాట్లాడుతూ–‘‘ప్రతిరోజూ పండగే’ నా కెరీర్‌లో చాలా ముఖ్యమైన సినిమా.

ఇలాంటి కథను నా దగ్గరకు తీసుకొచ్చిన మారుతిగారికి థ్యాంక్స్‌. సత్యరాజ్‌గారి పాత్రను మర్చిపోలేను. రావు రమేశ్‌గారితో నేను చేసిన సినిమాలన్నీ సక్సెస్‌. ఈ సక్సెస్‌ను మెగా అభిమానులకు, తెలుగు ప్రేక్షకులకు అంకితం ఇస్తున్నా’’ అన్నారు. ‘‘ఈ కథ రాసుకున్నప్పుడు రాజమండ్రిలో చిత్రీకరించాలనుకున్నాను. సక్సెస్‌మీట్‌ను రాజమండ్రిలోనే నిర్వహించాలని షూటింగ్‌ అప్పుడే అనుకున్నాను.. ఇప్పుడు చేశాం’’ అన్నారు మారుతి. ‘‘తేజూ అంటే నాకు చాలా ఇష్టం. అలాంటి వ్యక్తికి ఇంత మంచి విజయం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు నిర్మాత ‘బన్నీ’ వాస్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement