అ!.. చిరు, బాలయ్యల మల్టీ స్టారర్‌..?

Chiranjeevi, Bala Krishna - Sakshi

నాని తొలిసారిగా నిర్మాతగా మారి తెరకెక్కించిన సినిమా అ!. ప్రయోగాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాకు విశ్లేషకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా ఓవర్‌ సీస్‌లో అ! మంచి వసూళ్లు రాబడుతుండటంతో అందరి దృష్టి దర్శకుడు ప్రశాంత్‌ వర్మపై పడింది. లఘు చిత్రాలతో దర్శకుడిగా సత్తా చాటిన ప్రశాంత్‌, వెండితెర మీద కూడా తొలి సినిమాతోనూ తనదైన ముద్ర వేశాడు.

అ! సక్సెస్ సాధించిన సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఈ యువ దర్శకుడు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. తనకు ఓ భారీ మల్టీ స్టారర్‌ చేయాలన్న కోరిక ఉందంటున్నాడు ప్రశాంత్‌. మెగాస్టార్‌ చిరంజీవి, నటసింహాం బాలకృష్ణలతో ఓ మల్టీ స్టారర్ సినిమా చేయాలని ఉందని వెల్లడించాడు. గతంలోనూ ఈ కాంబినేషన్‌లో సినిమా చేసేందుకు ప్రయత్నాలు జరిగినా ఫలించలేదు. మరి ప్రశాంత్ అయినా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను సెట్స్‌ మీదకు తీసుకొస్తాడేమో చూడాలి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top