అలీ @ కలామ్‌ | Prakash Javadekar releases first look of APJ Abdul Kalam biopic | Sakshi
Sakshi News home page

అలీ @ కలామ్‌

Feb 10 2020 3:04 AM | Updated on Feb 10 2020 3:04 AM

Prakash Javadekar releases first look of APJ Abdul Kalam biopic - Sakshi

‘కలామ్‌’ బయోపిక్‌

భారతరత్న, మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలామ్‌ బయోపిక్‌ హాలీవుడ్‌లో తెరకెక్కుతోంది. కలామ్‌ పాత్రను నటుడు అలీ పోషిస్తున్నారు. పప్పు సువర్ణ నిర్మాణంలో జగదీష్‌ దానేటి, జానీ మార్టిన్‌ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ను కేంద్ర సమాచార శాఖ మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ ఆదివారం ఢిల్లీలో విడుదల చేశారు. ‘‘సినీ జీవితంలో అత్యంత సంతృప్తిని ఇచ్చిన పాత్ర ఇది. కలామ్‌గారితో ఫొటో దిగితే చాలనుకున్నాను. ఆయన బయోపిక్‌లో నటించే అవకాశం రావడం నా అదృష్టం’’ అన్నారు అలీ. ‘‘అలీగారికి ఇది 1,111వ చిత్రం. ఈ పాత్రకు ఆయన సరిగ్గా సరిపోయారు’’ అన్నారు జగదీష్‌ దానేటి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement