బాహుబలి బన్‌ గయా పోలీస్‌!

Prabhas not a Police... he is thief in sahoo? - Sakshi

కత్తి పట్టిన బాహుబలి తుపాకీ పడితే! బాణాలు వేసిన బాహుబలి బుల్లెట్స్‌ పేల్చితే! సైన్యంతో యుద్ధం చేసిన బాహుబలి చేజింగ్‌కి వెళితే ఎలా ఉంటుంది? ‘సాహో’ సినిమాలా ఉంటుందట. ప్రభాస్‌ హీరోగా ‘రన్‌ రాజా రన్‌’ ఫేమ్‌ సుజీత్‌ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్న సినిమా ‘సాహో’. ఇందులో శ్రద్ధాకపూర్‌ కథానాయిక. ప్రస్తుతం ఈ సినిమాలోని చేజింగ్‌ సీన్స్‌ను తెరకెక్కిస్తున్నారని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘సాహో’ చిత్రంలో ప్రభాస్‌ పోలీస్‌ పాత్ర పోషిస్తున్నారని టాక్‌.

అంటే.. బాహుబలి బన్‌గయా పోలీస్‌ అన్నమాట. దొంగ–పోలీస్‌ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా కథనం సాగుతుందట. అంతేకాదండోయ్‌.. ప్రభాస్‌ క్యారెక్టర్‌లో కూడా డిఫరెంట్‌ షేడ్స్‌ ఉంటాయన్నది ఫిల్మ్‌నగర్‌ టాక్‌. అసలు ప్రభాస్‌ క్యారెక్టర్‌.. పోలీస్‌గా ఉన్న దొంగా? లేక దొంగగా ఉన్న పోలీస్‌నా? అనే డౌట్‌ బ్యాక్‌డ్రాప్‌లో కథ సాగుతుందట. ఈ సినిమాలోని యాక్షన్‌ స్టంట్స్‌ను హాలీవుడ్‌ యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ కెన్నీ బెట్స్‌ డిజైన్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. శనివారంతో హైదరాబాద్‌లో షెడ్యూల్‌ కంప్లీట్‌ అయింది. ఫిబ్రవరి 25న ప్రారంభమయ్యే తదుపరి షెడ్యూల్‌ 60 రోజుల పాటు దుబాయ్‌లో జరుగుతుంది. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ‘సాహో’ చిత్రాన్ని ఈ ఏడాది రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top