ప్రభాస్‌ కొత్త సినిమా అప్‌డేట్‌

Prabhas New Movie Update - Sakshi

ప్రస్తుతం సాహో సినిమా పనుల్లో బిజీగా ఉన్న యంగ్ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ తరువాత చేయబోయే సినిమాను కూడా ఫైనల్‌ చేశాడు. జిల్‌ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌లో నటించేందుకు ఓకె చెప్పాడు ప్రభాస్‌. ఈ సినిమా షూటింగ్‌జూన్‌లోనే ప్రారంభించాల్సి ఉన్నా సాహో షూటింగ్ ఆలస్యమైన కారణంగా తదుపరి చిత్రాన్ని ఆగస్టులో ప్రారంబించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను కూడా యూవీ క్రియేషన్స్‌ సంస్థే నిర్మించనుంది.

రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడిగా పూజా హెగ్డే నటించనుంది. యూరప్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా మేజర్‌ పార్ట్‌ విదేశాల్లోనే చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారు. కొన్ని సన్నివేశాలు హైదరాబాద్‌లో సెట్స్‌ వేసి షూట్‌ చేసినా అవి కూడా విదేశాల్లో అన్నట్టుగానే చూపించనున్నారట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top