స్టార్‌ కొరియోగ్రాఫర్‌తో ప్రభాస్‌ | Prabhas Movie with Raju Sundaram | Sakshi
Sakshi News home page

Feb 24 2018 3:34 PM | Updated on Jul 17 2019 10:14 AM

Prabhas - Sakshi

ప్రభాస్‌

బాహుబలి లాంటి భారీ చిత్రం తరువాత గ్యాప్‌ తీసుకున్న ప్రభాస్‌ ప్రస్తుతం సాహో సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. సుజీత్‌ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రభాస్‌ సొంత నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్‌ నిర్మిస్తోంది. సాహో తరువాత అదే బ్యానర్‌ లో జిల్‌ ఫేం రాధకృష్ణ దర్శకత్వంలో నటించేందుకు ఓకె చెప్పాడు డార్లింగ్‌. ఈ రెండు సినిమాల తరువాత ప్రభాస్‌ బాలీవుడ్ ఎంట్రీ ఉంటుందని భావించారు.

అయితే తాజాగా ప్రభాస్‌ మరో దక్షిణాది దర్శకుడికి ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ రాజు సుందర్‌ దర్శకత్వంలో నటించేందుకు ప్రభాస్‌ అంగీకరించాడట. ఇప్పటికే రాజు సుందరం కథ విన్న ప్రభాస్‌ పూర్తి స్క్రిప్ట్ రెడీ చేయమన్నాడట. ఈ ప్రాజెక్ట్ పై ప్రభాస్‌ నుంచిగాని, రాజు సుందరం నుంచి గాని ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా.. టాలీవుడ్‌ లో ఈ వార్త తెగ హల్‌ చల్ చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement