మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో పూజ | Pooja Hegde To Romance NTR | Sakshi
Sakshi News home page

మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో పూజ

Nov 1 2017 10:10 AM | Updated on Nov 1 2017 10:34 AM

Pooja Hegde To Romance NTR

డీజే దువ్వాడ జగన్నాథమ్‌ సినిమాతో టాలీవుడ్‌లో ఘనవిజయాన్ని అందుకున్న పూజా హెగ్డే వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా తెరకెక్కుతున్న సాక్ష్యం సినిమాలో నటిస్తున్న పూజ, రామ్‌ చరణ్‌ కొత్త సినిమా రంగస్థలంలో స్పెషల్‌ సాంగ్‌ చేసేందుకు అంగీకరించింది. దీంతో పాటు మరో క్రేజీ ఆఫర్‌ను తన ఖాతాలో వేసుకుంది ఈ భామ. ఎన్టీఆర్‌ హీరోగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కించబోయే సినిమాలోనూ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించనుంది.

ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమాలో అనుఇమ్మాన్యూల్‌ ఒక హీరోయిన్‌గా నటిస్తోంది. మరో హీరోయిన్‌ రోల్ కు పూజ ను ఫైనల్‌ చేశారన్న టాక్‌ వినిపిస్తోంది. ప‍్రస‍్తుతానికి అధికారిక సమాచారం లేకపోయినా ఎన్టీఆర్‌కు జోడిగా పూజా హెగ్డే నటించటం కన్ఫమ్‌ అన్న టాక్‌ బలంగా వినిపిస్తోంది. త్వరలోనే ఈ కాంబినేషన్‌పై అఫీషియల్‌ ఎనౌన్స్‌మెంట్‌ వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement