నేనా సినిమా చేయట్లేదు..! | Pooja gandhi says i am not doing Dandupalyam 4 | Sakshi
Sakshi News home page

Mar 1 2018 2:01 PM | Updated on Mar 1 2018 5:15 PM

Pooja gandhi says i am not doing Dandupalyam 4 - Sakshi

శ్రీనివాస్‌ రాజు దర్శకత్వంలో క్రైం థ్రిల్లర్‌గా తెరకెక్కిన దండుపాళ్యం సినిమా సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే తరువాత ఆ సినిమాకు సీక్వల్‌ గా తెరకెక్కిన దండుపాళ్యం 2 ఆ స్థాయిలో విజయం సాధించకపోయినా.. చిత్రయూనిట్ మరో సీక్వల్‌ను తెరకెక్కించారు. ప్రస్తుతం దండుపాళ్యం 3 రిలీజ్‌ అవుతుండగా చిత్రయూనిట్ దండుపాళ్యం 4 పోస్టర్‌ను కూడా లాంచ్‌ చేశారు.

ఈ పోస్టర్‌లో గత చిత్రాల్లో నటించిన వారే కనిపించారు. కానీ ఈ విషయంపై నటి పూజా గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను దండుపాళ్యం 4లో నటించటం లేదని తెలిపారు. తనను ఈ సినిమాలో నటించాల్సిందగా ఎవరూ అడగలేదని. తన అనుమతి లేకుండానే తన ఫొటోనూ పోస్టర్‌లో వేశారని తెలిపారు. తనను గాని తనకు సంబంధించిన వ్యక్తులను కానీ సంప్రదించకుండా తన పేరు వాడుకోవటం హాస్యాస్పదంగా ఉందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement