
పెళ్లిచూపులు సినిమాలో ఆయన చేసిన కామెడీని ఎంజాయ్ చేయని వారు లేరంటే అతిశయోక్తి కాదు. ఆయనకు ఆసినిమా జాతీయ స్థాయిలో పెద్ద గుర్తింపు తీసుకువచ్చింది. ఆ తరువాత టాలీవుడ్‌లో వరుస చిత్రాలతో నవ్వుల పువ్వులు పూయిస్తున్న టాలీవుడ్ యువ కమెడియన్ ప్రియదర్శితో సాక్షి చిట్‌చాట్..
చదువు అనంతరం కష్టపడి సినీ అవకాశాలు పొందిన తాను, సినిమా పరిశ్రమలో ఉత్తమ కమిడియన్‌గా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా స్థానం సాధించుకోవడమే తన లక్ష్యమని యువ హాస్యనటుడు ప్రియదర్శి పులికొండ అన్నారు. తండ్రి ఆచార్య పులికొండ సుబ్బాచారి పదవీ విరమణ కోసం ద్రవిడ విశ్వవిద్యాలయానికి వచ్చిన ఆయన్ను సాక్షి పలకరించింది.
సాక్షి : సినిమా అవకాశాలు ఎలా వచ్చాయి..?
ప్రియదర్శి : షార్ట్ ఫిలిమ్‌ల ద్వారానే సినిమాలో అవకాశం వచ్చింది. దర్శకుడు తరుణŠ భాస్కర్ పెళ్ళిచూపులు సినిమాలో అవకాశం కల్పించారు.
సాక్షి : మొదటి సినిమాకే అవార్డులు రావడం ఎలా అనిపించింది...?
ప్రియదర్శి : మొదటి సినిమా పెళ్ళిచూపులు సినిమాకు జాతీయ స్థాయి అవార్డు రావడం మంచి గుర్తింపు లభించింది. జీవితంలో మరుపురాని సినిమాగా నాకు నిలిచిపోయింది.
సాక్షి : ప్రస్తుతం ఏ సినిమాల్లో నటిస్తున్నారు...?
ప్రియదర్శి : విక్టరీ వెంకటేష్, వరుణ్‌తేజ్‌ల మల్టీస్టారర్ సినిమా ఎఫ్2, పడిపడి లేచే మనసు, డూడ్, మిఠాయి సినిమాలలో నటిస్తున్నాను. వీటితో పాటు మరో ఐదు సినిమాల్లో నటిస్తున్నాను.
సాక్షి : తమిళ సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయా..?
ప్రియదర్శి : తమిళంలో బైలింగువల్ సినిమాల్లో నటిస్తున్నాను. రీసెంట్‌గా స్పైడర్ సినిమాలో నటించాను. తమిళం నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయి.
సాక్షి : హీరోగా ప్రేక్షకులను అలరించే అవకాశం ఉందా..?
ప్రియదర్శి : అంత పెద్ద ఆశ లేదు గానీ.. సినీ పరిశ్రమలో ఉత్తమ నటుడుగా గుర్తింపు పొందాలని వుంది.
సాక్షి : కుప్పంలో వాతావరణ ఎలా ఉంది.?
ప్రియదర్శి : కుప్పం నాకు ప్రత్యేకమైంది. మా నాన్న గత 15 ఏళ్ళుగా ఇక్కడే పనిచేస్తున్నారు. ఇక్కడి వాతావరణం ఊ టీని తలపిస్తుంది. కుప్పం నాకు రెండో ఇళ్లు లాంటింది.
సాక్షి : షార్ట్ ఫిలిమ్స్‌లో ఇంకా నటిస్తున్నారా..?
ప్రియదర్శి : సినిమాల్లో అవకాశాలు వస్తుండంలో షార్ట్ ఫిలిమ్స్‌లో నటించడానికి సమయం దొరడం లేదు. సినిమాల్లో అవకాశం పొందడానికి షార్ట్ ఫిలిమ్స్ మంచి ఫ్లాట్‌ఫారం లాంటింది.