అనారోగ్యంతో బాధపడుతున్న పవన్‌ కల్యాణ్‌

Pawan Kalyan Is Suffering With Back Pain - Sakshi

జనసేన అధినేత, సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ గురువారం మధ్యాహ్నం ఓ పత్రికా ప్రకటనను విడుదల చేశారు. ఈ మేరకు సోషల్‌ మీడియా ద్వారా  ఈ విషయాన్ని చెబుతూ.. గబ్బర్‌ సింగ్‌ షూటింగ్‌లో వెన్నుమొకకు తగిలిన గాయం మళ్లీ ఎక్కువ అయినట్లు తెలిపారు.

ఈ కారణంగానే విజయవాడలో ఏర్పాటు చేసిన రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి హాజరు కాలేకపోతున్నానని అన్నారు. మీడియా స్వేచ్చ కోసం చేస్తున్న ఈ పోరాటానికి తన మద్దతు ఉంటుందన్నారు. అయితే తనకు తలెత్తిన ఈ సమస్యకు వైద్యం తీసుకుంటున్నందున మూడు రోజుల పాటు ఎటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని పేర్కొన్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top