‘సవ్యసాచి’ మరో పాట : ఒక్కరంటే ఒక్కరూ..

Okkarantey Okkaru Song From Naga Chaitanya Savyasachi - Sakshi

అక్కినేని యువ కథనాయకుడు నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న డిఫరెంట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ సవ్యసాచి. కార్తీకేయ, ప్రేమమ్‌ లాంటి హిట్ చిత్రాలను అందించిన చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి.

నవంబర్‌ 2న రిలీజ్‌ కు రెడీ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో వేగం పెంచారు చిత్రయూనిట్. తాజాగా సినిమాలో కీలకమైన అమ్మ పాటను రిలీజ్ చేశారు. తన కొడుకు ఎడమ చేయి అతని మాట వినకుండా కొడుకును ఇబ్బందులకు గురి చేస్తుంటే ఆ తల్లి పడే ఆవేదనే ఒక్కరంటే ఒక్కరు అంటూ సాగే పాట.

కీరవాణి సంగీతమందించిన ఈ పాటకు రామ జోగయ్య శాస్త్రి సాహిత్యమందించగా శ్రీనిధి తిరుమల ఆలపించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా సీనియర్‌ నటుడు మాధవన్‌, భూమిక ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top